
బెజవాడలో అల్లు విగ్రహావిష్కరణ
హాస్యనటుడు అల్లు రామలింగయ్య వ్యక్తిత్వం అజరామరమని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు.
విజయవాడ: హాస్యనటుడు అల్లు రామలింగయ్య వ్యక్తిత్వం అజరామరమని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళా క్షేత్రం ప్రాంగణంలో ఆదివారం చిరంజీవి అల్లు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అల్లు కుమారుడు అరవింద్, హాస్య నటుడు బ్రహ్మానందం, వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, ్ల తదితరులు పాల్గొన్నారు. అల్లు జాతీయ పురస్కారాన్ని పరుచూరి బ్రదర్స్‌కు అందజేశారు.