బెజవాడలో చిరంజీవి 150వ సినిమా! | Chiranjeevi unveils Allu ramalingaiah's statue in vijayawada | Sakshi

బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!

Published Mon, Oct 6 2014 9:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!

బెజవాడలో చిరంజీవి 150వ సినిమా!

విజయవాడ : మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు బెజవాడ వేదిక కానుంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి, చిరంజీవే స్వయంగా వెల్లడించారు. అవకాశం వస్తే తన 150వ చిత్రానికి విజయవాడలోనే శ్రీకారం చూడతానని ఆయన ప్రకటించారు. ప్రముఖ హాస్యనటుడు దివంగత డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిన్న బెజవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది.

ఈ సందర్భంగా కళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో మొట్టమొదటిసారిగా అల్లు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. సినిమా రంగానికి విజయవాడ ఎప్పుడో రాజధాని అయ్యిందన్నారు. అల్లు రామలింగయ్య పేరుమీద ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణలకు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement