ఇది కొత్తవాళ్ళ హౌస్! | house movie directed by rajushetti | Sakshi

ఇది కొత్తవాళ్ళ హౌస్!

Sep 28 2016 12:39 AM | Updated on Sep 4 2017 3:14 PM

ఇది కొత్తవాళ్ళ హౌస్!

ఇది కొత్తవాళ్ళ హౌస్!

‘‘నటుడు ఉత్తేజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశా. ఆయన్ను బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ప్రతి విషయంపై అవగాహన వచ్చింది.

‘‘నటుడు ఉత్తేజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశా. ఆయన్ను బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ప్రతి విషయంపై అవగాహన వచ్చింది. ఆ అనుభవంతోనే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘హౌస్’ తెరకెక్కించా. దర్శకుణ్ణి కావాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు దర్శకుడు రాజుశెట్టి. జై, వసుంధర జంటగా ఆయన దర్శకత్వంలో బోయన కృష్ణారావు నిర్మించిన చిత్రం ‘హౌస్’. శశాంక్ భాస్కరుణి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. 
 
 త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు నిర్మాత. ‘‘నా శిష్యుడు రాజుశెట్టి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త వారందరూ కలిసి చేసిన ఈ చిత్రం విజయవంతమవ్వాలి’’ అని ఉత్తేజ్ అన్నారు. కృష్ణారావు, దర్శకుడు క్రాంతిమాధవ్, నిర్మాత ముత్యాల రాందాస్, హీరో మానస్ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement