కుక్క కావాలి.. అనే మాటలు వింటే, ‘చిత్రం’ సినిమాలో ఉత్తేజ్ కూతురు చేతన గుర్తొస్తుంది. ఆ సినిమాలో చిన్నారి చేతన కుక్క కావాలని మారాం చేస్తుంటుంది. చిన్నప్పుడు తమన్నా కూడా అలానే మారాం చేసేవారట. ‘ఓ కుక్కను పెంచుకుంటా మమ్మీ’ అంటే.. తమన్నా అమ్మ ససేమిరా అనేవారట. అలా తమన్నా చిన్ని కోరిక నెరవేరలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇటీవలే ఆమె కోరిక తీరింది. అందుకు కారణం హిందీ చిత్రం ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’. అక్షయ్‌కుమార్ సరసన తమన్నా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఇందులో ఓ కుక్కపిల్ల కీలక పాత్ర చేసింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆ కుక్కపిల్లకు తమన్నా బాగా దగ్గరయ్యారట. దాంతో కుక్కపిల్లను కొనుక్కోవాలనే చిన్ననాటి కోరిక ఆమెలో రెట్టింపయ్యింది. ఇప్పుడైనా కుక్కపిల్లను కొనుక్కోవడానికి అనుమతివ్వమని తన తల్లిని బతిమాలుకున్నారట. ఈసారి తమన్నా తల్లి ఆమెకు పచ్చజెండా ఊపారు. దాంతో ఓ కుక్కపిల్లను కొనుక్కుని దానికి ‘పెబెల్’ అని నామకరణం చేశారు తమన్నా.
కుక్క కావాలి!
Published Mon, Jul 14 2014 12:37 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement