
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖు బసవతారకం ఆసత్రికి వెళ్లి అక్కడ ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.



Comments
Please login to add a commentAdd a comment