
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో యూట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి.
తాజాగా ఈ పాటకు పేరడీగా రూపొందించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేశారు. రంగమ్మ మంగమ్మ పాటను రామ్ చరణ్ నటనకు తగ్గట్టుగా‘ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడూ.. ఇన్ని నాళ్లు యాడదాగే ఇంత నటుడు’ అంటూ పేరడీ చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ స్వయంగా ఆలపించి, నటించారు.
Comments
Please login to add a commentAdd a comment