
సాక్షి, చెన్నై: తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ మేకప్ చీఫ్ సి.మాధవరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (76) కరోనాతో చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నెలరోజుల క్రితం మాధవరావు దంపతులు చెన్నైకి వెళ్లి కోవిడ్ బారినపడ్డారు. రాంప్రసాద్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చి చికిత్సకు సహకరించాడు. కాకినాడలో ఉన్న కుమార్తె గీత, అమెరికాలో ఉన్న చిన్న కుమారుడు రాజ చెన్నైకి చేరుకున్నారు.
మాధవరావు కోలుకోగా సుబ్బలక్ష్మమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ, నరేష్ పరామర్శ సుబ్బ లక్ష్మమ్మ మరణ సమాచారం అందగానే నటులు కృష్ణ, నరేష్, మరికొందరు సినీ ప్రముఖులు ఫోన్ ద్వారా మాధవరావును పరామర్శించి సంతాపం తెలిపారు.