
సాక్షి, హఫీజ్‌పేట్: ప్రముఖ సినీ నటుడు కాకరాల సత్యనారాయణ భార్య సూర్య కాంతం(81) మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్)ఫౌండేషన్ వయోధికాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. కన్నుముశారు. సుమారు రెండువందల సినిమాల్లో నటించిన కాకరాల సత్యనారాయణ, ఆయన భార్యతో కలిసి కొంతకాలంగా సీఆర్ ఫౌండేషన్ వయోధికాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన తనకంటూ సొంత ఆస్తిని కూడా మిగుల్చుకోలేదు. వీరి ఇద్దరి కుమార్తెలూ విప్లవోద్యమ క్షేత్రంలో పనిచేస్తున్నారు.
ఆమె భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్‌లో ఉంచారు. ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ, సూర్యకాంతం భర్త కాకరాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.రామకృష్ణ, వి.చెన్నకేశవరావు, డాక్టర్ కె.రజిని ఆమెకు నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి సూర్యకాంతం కళ్లను దానం చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అప్పగిస్తామని కాకరాల తెలిపారు.
చదవండి:
మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట
‘వరుణ్ తేజ్ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’
Comments
Please login to add a commentAdd a comment