satynarayana
-
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి -
నటుడు కాకరాల సత్యనారాయణకు సతీ వియోగం
సాక్షి, హఫీజ్‌పేట్: ప్రముఖ సినీ నటుడు కాకరాల సత్యనారాయణ భార్య సూర్య కాంతం(81) మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్)ఫౌండేషన్ వయోధికాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. కన్నుముశారు. సుమారు రెండువందల సినిమాల్లో నటించిన కాకరాల సత్యనారాయణ, ఆయన భార్యతో కలిసి కొంతకాలంగా సీఆర్ ఫౌండేషన్ వయోధికాశ్రమంలో నివసిస్తున్నారు. ఆయన తనకంటూ సొంత ఆస్తిని కూడా మిగుల్చుకోలేదు. వీరి ఇద్దరి కుమార్తెలూ విప్లవోద్యమ క్షేత్రంలో పనిచేస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని సీఆర్ ఫౌండేషన్‌లో ఉంచారు. ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ, సూర్యకాంతం భర్త కాకరాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ, పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.రామకృష్ణ, వి.చెన్నకేశవరావు, డాక్టర్ కె.రజిని ఆమెకు నివాళులర్పించారు. ఎల్వీ ప్రసాదు కంటి ఆస్పత్రికి సూర్యకాంతం కళ్లను దానం చేశారు. ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అప్పగిస్తామని కాకరాల తెలిపారు. చదవండి: మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట ‘వరుణ్ తేజ్ ‘గని’ కోసం శరీరాకృతి మార్చాలి’ -
ఆంగ్లంలో ఉత్పలమాల
నాటి కాలంలో సంపన్నులకూ సంస్థానాధీశులకూ నీలగిరి కొండల్లోని ఊటీలో వేసవి విడిది భవనాలుండేవి. అప్పటి విజయనగర సంస్థానాధీశుడైన అలక్ నారాయణ గజపతి(1930 ప్రాంతం), తన ఆస్థానంలో ఉన్న హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసుతో కలిసి ఊటీకి ప్రయాణం చేస్తున్నారు. గజపతి స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నారు. ఎగుడు దిగుడుగా ఉన్న ఘాట్ రోడ్డు మీద వేగంగా నడుపుతున్నారాయన. ‘‘కారును కొంచెం నెమ్మదిగా నడపండి’’ అన్నారు ఆదిభట్ల. ‘‘అబ్బే మీకేమీ భయం లేదు దాసుగారూ! నేను స్వయంగా నడుపుతున్నాను గదా’’ అన్నారట గజపతి. ‘‘అదేనండి నా భయం’’ అన్నారు దాసు. విషయాన్ని గ్రహించి తేలిగ్గా నవ్వేసి కారును నెమ్మది చేశారు గజపతి. ఆదిభట్ల నారాయణదాసుకు కవిత్వంలో విచిత్ర విన్యాసాలు చేయడం అలవాటు. ఇంగ్లిష్‌లో పరమేశ్వరుని స్తుతిస్తూ చెప్పిన ఉత్పలమాల పద్యమిది– హెడ్డున మూను, స్కిన్నుపయి నెంతయు డస్టును, ఫైరు నేత్రమున్ సైడున గ్రేటు బుల్లు, బహుచక్కని గాంజెసు హైరు లోపలన్, బాడికి హాఫెయౌచు నల పార్వతి మౌంటెను డాటరుండ, ఐ షడ్డు డివోటు దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్! - డి.వి.ఎం. సత్యనారాయణ -
సత్యదేవా! సత్ఫలితమివ్వు!
-రత్నగిరికి వెల్లువెత్తుతున్న టెన్త్ విద్యార్థులు -వివాహాలతో ఆలయ ప్రాంగణంలో పెరిగిన రద్దీ అన్నవరం : పౌర్ణమి పర్వదినం, ఆదివారం కలిసి రావడంతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. వివాహాలు జోరుగా జరుగుతుండడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులు, సత్యదేవుని దర్శించేందుకు వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణంతో పాటు వ్రతమండపాలు, సత్రాలు నిండిపోయాయి. కాగా ఈ నెల 17 నుంచి çపరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటూ పెద్దసంఖ్యలో స్వామి సన్నిధికి వస్తున్నారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకుంటున్నారు. వీరందరితో ఆలయప్రాంగణంలో సందడికి తెరిపి ఉండడం లేదు. స్థానిక శ్రీసత్యసాయి విద్యావిహార్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవాలని వారిని పండితులు ఆశీర్వదించారు. సత్యదేవుని దర్శించిన 20 వేలమంది భక్తులు ఆదివారం సత్యదేవుని 20 వేలమంది దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు గోకులంలో సప్తగోప్రదక్షణ అనంతరం రావి చెట్టుకు పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,619 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.