రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
తీవ్ర గాయంతో 9 నెలల కుమారుడు
ఆదుకోవాలని అభాగ్యుడి వేడుకోలు
విశాఖపట్నం: ‘రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయాను. అదే ప్రమాదంలో తొమ్మిది నెలల కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. నేను చేస్తున్నది కూలి పని. కుమారుడికయ్యే శస్త్ర చికిత్సలకు ఆర్థిక స్థోమత లేదు. ఇప్పటికి గ్రామస్తుల సహకారంతో మూడు శస్త్ర చికిత్సలు జరిగాయి. నా కుమారుడ్ని బతికించాలని దాతలను వేడుకుంటున్నా. నిండు హృదయంతో ముందుకొచ్చి నా బిడ్డను రక్షించండ’ని ఇటీవల విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయి.. కుమారుడ్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న ఇ.రాంబాబు కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈ అభాగ్యుడు వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో తన బాధలను వివరించాడు.
కుమారుడు ఇ.కుశాల్‌కు పుట్టు జుత్తు తీయించడానికి భార్య ఇ.త్రివేణితో కలిపి లక్కవరపుకోట శ్రీరామపురం గ్రామం నుంచి విశాఖలోని అత్తవారింటికి ఈ నెల 3న ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రివేణి మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ కుశాల్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆస్పత్రి ఖర్చులు భరించడానికి తన ఆర్థిక పరిస్థితి సరిపోదని, తన కుమారుడ్ని బతికించుకోడానికి దాతల సాయం కోరుతున్నట్టు రాంబాబు తెలిపాడు. తన కుమారుడికి ప్రాణం పోయాలని వేడుకున్నాడు. దాతలు కె .లక్ష్మి పేరిట ఉన్న కెనరాబ్యాంక్ డాబాగార్డెన్స్ శాఖలోని అకౌంట్ నెంబరు 0620108000007కు సొమ్ము జమ చేయాలని, లేదా 9963884410, 7207820494 నంబర్లకు ఫోన్ చేసి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.
నా బిడ్డను బతికించరూ..
Published Fri, Jul 17 2015 1:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement