గూడూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం రావూరు సమీపంలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త రాంబాబు కథనం ప్రకారం... భార్య వెంకట నాగమణి(23)తో కలిసి ద్విచక్ర వాహనంపై కావలి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్పాడు. తామిద్దరం కావలి నుంచి చెరువు మీదుగా బైక్‌పై రావూరు వస్తున్నామని, గుర్తు తెలియని వాహనం తమ బైక్‌ను ఢీకొట్టిందన్నాడు.
ఈ ఘటనలో తనకు గాయాలు కాగా భార్య నాగమణి తీవ్రగాయాలతో మృతిచెందిందని రాంబాబు చెబుతున్నాడు. ఆయన చికిత్స కోసం కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. కాగా, రాంబాబే నాగమణిని చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Published Sat, Oct 29 2016 3:05 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement