ఎమ్మిగనూరు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. నందవరం గ్రామానికి చెందిన బడేబూ, రఫీ స్కూటర్‌పై ఎమ్మిగనూరుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది.
ఈ ప్రమాదంలో బడేబూ అక్కడికక్కడే మృతిచెందింది. రఫీ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఎమ్మిగనూరు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.