భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం | suicide attempted by newly married couple in ranga reddy district, wife died | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం

Published Sun, Jul 3 2016 8:44 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం - Sakshi

భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం

కీసర: రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. భార్య గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా.. ఆస్పత్రిలో భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

కీసర మండలం కుందన్‌పల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు రజిత(22), మహేష్(25). గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కత్తితో రజిత గొంతు కోసిన మహేష్, తాను కూడా గొంతు కొసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడానికి యత్నించే లోపే రజిత మృతిచెందింది. మహేష్‌ను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement