భార్యను కడతేర్చిన భర్త
Published Wed, Dec 7 2016 3:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
చందంపేట (నేరడుగొమ్ము) : ఏడడుగులు వేసి జీవితాంతం తనతో అండగా నిలవాల్సిన భర్తే కాలయముడయ్యాడు. క్షణికావేశంలో భార్యను అత్యంత క్రూరంగా రాయి తో కొట్టాడు. అనంతరం ఆమె మృతి చెందలేదని భావించి పురుగుల మందు తాగించి హతమార్చాడు. ఈ ఉదంతం నేరడుగొమ్ము మండల పరిధిలోని జోడుబావితండాలో మంగళవారం చోటు చేసుకుంది. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, నింది తుడు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జోడుబావితండాకు చెం దిన లావుడ్య విజయ (30)కు అదే గ్రా మానికి చెందిన అండిల్ అనే వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యభర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విజ య కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుండగా అండిల్ నిత్యం మద్యం సేవిస్తూ భార్యపిల్లలను పట్టించుకోకుండా తిరుగుతుండేవా డు.
ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పత్తి ఏరేందుకు వెళ్లి మూడు రోజుల క్రితం తిరిగి వచ్చారు. వచ్చిన రోజు నుంచీ అండిల్ మద్యం తాగి భార్యతో ఘర్షణ పడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా కుటుంబ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అనంతరం జోడుబావితండా శివారులో తమకు ఉన్న ఎకరం సొంత పొలంలో పత్తి ఏరేందుకు వెళ్లారు. అక్కడ కూలీలతో పత్తి ఏరిద్దామని అండిల్ పేర్కొన్నాడు. ‘అసలే పైసలు లేవు..కూలీలు ఎందుకు.. మనమే ఏరుకుందాం’ అని విజయతెలిపిం ది. దాంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.
అప్పటికే గతంలో జరి గిన గొడవల నేపథ్యంలో అండిల్ భార్యపై కో పంతో ఉన్నాడు. మళ్లీ గొడవ జరగడంతో ఆవేశంతో అండిల్ పక్కనే ఉన్న రారుుని తీసుకొని భార్యపై గట్టిగా మో దాడు. ఆమె మృతి చెందలేదని భావించి అనంతరం పొలంలో ఉన్న క్రిమిసంహారక మందును తీసుకొచ్చి భార్యకు తాపించాడు. దాంతో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత తేరుకున్న అం డిల్ మృతురాలి సోదరుడికి ఫోన్ చేసి ‘మీ అక్క మృతి చెందింది’ అని పేర్కొన్నాడు. తల్లిదండ్రులు వెంటనే వచ్చి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలి పారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement