Candampeta
-
ఉమ్మడి మండలం పర్యాటక ప్రాంతమయ్యేనా..?
చందంపేట (నేరడుగొమ్ము) : చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో ఓ వైపు చుట్టూ దట్టమైన అడవులు.. మరోవైపు నాగార్జునసాగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా చుట్టూ నీరు, రకరకాల పక్షుల కిలకిలరావాలతో ఎటు చూసినా మనసును పులకరింపచేసే అందాలే. ఇవేకాక భక్తి పారవశ్యానికి నిదర్శంగా నిలిచే అతి పురాతనమైన దేవాలయాలు.. 13వ శతాబ్ధంలో రాజులు, మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు, గిరిజన సంస్కృతీ స్పష్టంగా కన్పిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అరకు తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామపంచాయతీ వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా చేస్తే దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరడుగొమ్ము మండలాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనే ఉద్దేశంతో జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇక్కడ పర్యటించిన మంత్రులూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పుష్కరాల సమయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ ప్రాంతంలో పర్యటించి వైజాగ్ కాలనీని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ మధ్య కాలంలో రాష్ట్ర అటవీశాఖా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలు కూడా చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లో పర్యటించి వారు కూడా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారని సమాచారం. పర్యాటక ప్రాంతమైతే.. చందంపేట, నేరడుగొమ్ము ఉమ్మడి మండలాల్లో 26,785 హెక్టార్లలో నాగార్జునసాగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. నాగార్జునసాగర్ - కృష్ణా నది పరివాహక బ్యాక్ వాటర్ చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు ఆనుకుని ఉంది. పురాతన దేవాలయాలు, అరకు అందాలు, చక్కటి రమణీయమైన దృశ్యాలు వీటన్నింటికి మించి ఇక్కడ కాచరాజుపల్లి గ్రామంలో బొర్రా గుహలను తలపించే నీలివర్ణం, ఆకుపచ్చని వర్ణంలో అతిపెద్ద గుహలూ ఉన్నాయి . దేవరచర్ల మునిస్వామి ఆలయం ప్రతి నిత్యం శివలింగంపై కొండచరియల నుంచి సంవత్సరం పొడుగునా నీళ్లు జాలువారుతుంటాయి . అంతే కాకుండా వైజాగ్ కాలనీ నుంచి బోటింగ్‌ను ఏర్పాటు చేసి నాగార్జున కొండ, ఏలేశ్వరం మల్లయ్యగట్టుకు లాంచీలను ఏర్పాటు చేస్తే ఇటు గిరిజన గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని ఇక్కడి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూపురేఖలు మారిపోతాయి వైజాగ్ కాలనీ పర్యాటక ప్రాంతమయ్యేందుకు అన్ని అర్హతలున్నాయి . గతంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్, అటవీశాఖా మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లా. సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేరుుంచి వీలైనంత త్వరలో ఉమ్మడి చందంపేట మండలం పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి చేస్తా. - నేనావత్ బాలునాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ -
భార్యను కడతేర్చిన భర్త
చందంపేట (నేరడుగొమ్ము) : ఏడడుగులు వేసి జీవితాంతం తనతో అండగా నిలవాల్సిన భర్తే కాలయముడయ్యాడు. క్షణికావేశంలో భార్యను అత్యంత క్రూరంగా రాయి తో కొట్టాడు. అనంతరం ఆమె మృతి చెందలేదని భావించి పురుగుల మందు తాగించి హతమార్చాడు. ఈ ఉదంతం నేరడుగొమ్ము మండల పరిధిలోని జోడుబావితండాలో మంగళవారం చోటు చేసుకుంది. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, నింది తుడు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జోడుబావితండాకు చెం దిన లావుడ్య విజయ (30)కు అదే గ్రా మానికి చెందిన అండిల్ అనే వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యభర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విజ య కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుండగా అండిల్ నిత్యం మద్యం సేవిస్తూ భార్యపిల్లలను పట్టించుకోకుండా తిరుగుతుండేవా డు. ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పత్తి ఏరేందుకు వెళ్లి మూడు రోజుల క్రితం తిరిగి వచ్చారు. వచ్చిన రోజు నుంచీ అండిల్ మద్యం తాగి భార్యతో ఘర్షణ పడుతున్నాడు. సోమవారం రాత్రి కూడా కుటుంబ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. అనంతరం జోడుబావితండా శివారులో తమకు ఉన్న ఎకరం సొంత పొలంలో పత్తి ఏరేందుకు వెళ్లారు. అక్కడ కూలీలతో పత్తి ఏరిద్దామని అండిల్ పేర్కొన్నాడు. ‘అసలే పైసలు లేవు..కూలీలు ఎందుకు.. మనమే ఏరుకుందాం’ అని విజయతెలిపిం ది. దాంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటికే గతంలో జరి గిన గొడవల నేపథ్యంలో అండిల్ భార్యపై కో పంతో ఉన్నాడు. మళ్లీ గొడవ జరగడంతో ఆవేశంతో అండిల్ పక్కనే ఉన్న రారుుని తీసుకొని భార్యపై గట్టిగా మో దాడు. ఆమె మృతి చెందలేదని భావించి అనంతరం పొలంలో ఉన్న క్రిమిసంహారక మందును తీసుకొచ్చి భార్యకు తాపించాడు. దాంతో విజయ అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత తేరుకున్న అం డిల్ మృతురాలి సోదరుడికి ఫోన్ చేసి ‘మీ అక్క మృతి చెందింది’ అని పేర్కొన్నాడు. తల్లిదండ్రులు వెంటనే వచ్చి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలి పారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విజయ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రైతులకు అన్యాయం జరగనివ్వం
చందంపేట :‘‘రైతులకు అనుకూలంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ చెప్పిండు...ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగనివ్వం, ముంపు బాధిత రైతు కుటుంబాలకు న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా’’ అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ పథకంలో భాగంగా చందంపేట మండలం నక్కలగండి తండా వద్ద 7.64 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలాన్ని శనివారం ఆయన సందర్శించారు. రిజర్వాయర్ పరిధిలో నక్కలగండి, తెల్దేవరపల్లి, మోత్యాతండాలకు చెందిన 170 ఎకరాలు, లింక్ కెనాల్ నిర్మాణంలో 65 ఎకరాలు ముంపునకు గురయ్యే బాధితులకు చెల్లింపులు కొలిక్కిరాకపోవడంపై రైతులు మంత్రికి వివరించారు. ఇన్‌టెక్‌వెల్‌పాయింట్ ప్రదేశంలో ఎస్ఎల్బీసీ ఇంజినీరింగ్ అధికారులు మ్యాప్‌ల ద్వారా రిజర్వాయర్ నిర్మాణ విషయాలను వివరించారు. పనులు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. 2008లో సర్వే జరిపి భూసేకరణ ప్రకారం కాకుండా ప్రస్తుతం మార్కెట్ విలువను బట్టి పరిహారం ఇప్పించాలని కోరారు. తమకు కూడ కొత్త రేట్లు ఇవ్వాలని, ఇప్పటికే పరిహారం తీసుకున్న బండింగ్ నిర్మాణ ముంపు బాధితులు విజ్ఞప్తి చేశారు. ముంపునకు గురయ్యే 3600 ఎకరాల్లో 726 ఎకరాలు నల్లగొండ జిల్లా పరిధిలోనివి కాగా, మిగతా భూమి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు సంబంధించి నవని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పెద్ద, చిన్న మొక్కలని తేడా లేకుండా బత్తాయి రైతులందరికీ పరిహారం సమానంగా ఇవ్వాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి కొత్త రేట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ తర్వాత మంత్రి మన్నెవారిపల్లి వద్ద సొరం గం మొదటి దశ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మాట్లాడుతూ రెండు నెలలుగా చెల్లింపులు జరగక కరెంట్ తొలగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ.35కోట్లు చెల్లించాలని కోరారు. ఆ తర్వాత సిద్దాపూర్ వద్ద మిడ్‌డిండి ఆన్లైన్ పనులను, పాకాల-జూరాల ఎత్తిపోతలకు కామన్ రిజర్వాయర్‌గా ఉపయోగించుకునే అవకాశాన్ని ఇంజినీర్లు వివరిం చారు. మంత్రి వెంట దేవరకొండ, మునుగోడు ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ కృష్ణారావు, ఎస్ఈ రాజు, ఈఈ దేవేందర్‌రెడ్డి, డిండి లిఫ్ట్ స్కీంల ఇంజినీర్ నరేందర్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎన్.సత్తయ్య, ఇంద్రసేనారెడ్డి, జూరాల పాకాల ఇంజినీర్ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కేతావత్ లాలునాయక్, సుధీర్‌రెడ్డి, డి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు, పాండునాయక్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యం డిండి : తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్కే సాధ్యమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం శ్రీశైలం సొరంగ పనులు, మిడ్‌డిండి నిర్మించే ప్రాంతం సందర్శించిన అనంతరం డిండికి చేరుకున్నారు. ఐబీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పదం ఉచ్చరించని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశాయన్నారు. సీమాంధ్ర నాయకులు నిధులు కేటాయించక పోవడం వల్లనే తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. దీంతో తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యల నివారణకు 24 గంటలు నీరందించేందుకు, పారిశ్రామికాబివృద్ధికి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటితో 20ఏళ్ల యువకులు కూడా 60ఏళ్ల ముసలి వాళ్లుగా మారుతున్నారని, దేవరకొండ నియోజకవర్గంలో గిరిజనులు బీదస్థితిలో ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు డిండి ఎత్తిపోతల నిర్మాణం, మిడ్‌డిండి నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసమే ఈ పర్యటనకు వచ్చానన్నారు. నిపుణులతో చర్చించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. డిండి ఎత్తిపోతల పరిపాలన అనుమతితోపాటు మిడ్‌డిండి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.