భార్య మృతి...భర్త పరిస్థితి విషమం | woman died in road accident | Sakshi
Sakshi News home page

భార్య మృతి...భర్త పరిస్థితి విషమం

Published Tue, Jan 9 2018 1:12 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

woman died in road accident

సాక్షి, శంషాబాద్‌ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గండిగుడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో స్కూటీపై వెళుతున్న భార్య అక్కడికక్కడే మృతిచెందగా తీ​వ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రంగారెడ్డి జిల్లా వేములునర్వ గ్రామానికి చెందిన దంపతులు రాములు, సుగుణ స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ సంఘటన స్థలంలో మృతిచెందగా, రాములు తీ​‍‘ంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement