స్టేజి మీద పడి.. మంత్రి తలకు గాయాలు
హిమాచల్ ప్రదేశ్ సీనియర్ మంత్రి విద్యా స్టోక్స్ (88) స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేదికపై పడిపోవడంతో.. ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. వేదిక మీద ప్రసంగించిన అనంతరం తన సీటు వైపు వెళ్తుండగా ఆమె కింద పడిపోయారు. దాంతో ఆమె తలకు స్వల్పంగా గాయాలయ్యాయని, అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉందని విద్యా స్టోక్స్‌తో పాటు ఉన్న ఓ అధికారి తెలిపారు.
ఇప్పటికి ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆమె.. చాలా కాలంగా భారత హాకీ సంఘంలో కూడా సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల, ప్రజారోగ్య శాఖలు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం గవర్నర్ నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. తొలిసారి ఆమె 1974లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.