ఏ ముహుర్తానా టీమిండియా, శ్రీలంక సిరీస్ ప్రారంభమైందో తెలియదు కానీ ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, సూర్యకుమార్‌లు దూరమయ్యారు. తొలి టి20 తర్వాత రుతురాజ్ కూడా గాయంతో వైదొలిగాడు. తాజాగా టీమిండియా టి20 స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ రెండో టి20 మ్యాచ్‌లో గాయపడ్డాడు.
టీమిండియా బ్యాటింగ్ సమయంలోనే ఇషాన్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో లాహిరు కుమారా 147. 6 కిమీ వేగంతో బౌన్సర్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే క్రమంలో ఇషాన్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. క్రీజు నుంచి పక్కకు వెళ్లిన ఇషాన్ హెల్మెల్ తీసిన తలను చూసుకున్నాడు. ఇంతలో ఫిజియో వచ్చి ఇషాన్‌ను పరిశీలించాడు.
అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో మ్యాచ్‌లో కంటిన్యూ అయ్యాడు. ఇక ఈ యువ ఓపెనర్ 16 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఇషాన్ కిషన్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగిలిందా లేక సాధారణమేనా అన్న కోణంలో సిటీస్కాన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితం ఆదివారం రానుంది. ఇప్పటికైతే ఇషాన్ బాగానే ఉన్నాడని.. అబ్జర్వేషన్‌లో ఉంచామని డాక్టర్ శుభమ్ తెలిపారు.
చదవండి: Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు
ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ మూడో టి20 ఆడేది అనుమానంగా మారింది. అతను ఆడకపోతే రోహిత్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ మూడో టి20లో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమల్ గాయం బారిన పడ్డాడు. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ సందర్భంగా చండిమల్ బొటనవేలుకు గాయమైంది. దీంతో చండిమల్ కూడా కంగ్రా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. వేలికి స్కానింగ్ నిర్వహించామని.. రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మెరుపులతో 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు
Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు
— Sports Hustle (@SportsHustle3) February 26, 2022
Comments
Please login to add a commentAdd a comment