టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ టి20ల్లో ఎంత ప్రమాదకారో మరోసారి రుచి చూపించాడు. నిలదొక్కుకుంటే బౌలర్లకు చుక్కలే అన్నంతలా సాగింది ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్. కొడితే బౌండరీ.. లేదంటే సిక్స్ అనేలా మ్యాచ్‌లో ఇషాన్ తుఫాన్‌లా విరుచుకుపడ్డాడు. మూడో ఓవర్లో కరుణరత్నే వేసిన ఫుల్‌టాస్ బంతితో ఇషాన్ బ్యాటింగ్ గేర్ ఉన్నపళంగా మార్చేశాడు. కవర్స్, ఎక్స్‌ట్రా కవర్–మిడాఫ్ గ్యాప్‌లో, బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వరుసబెట్టి మూడు ఫోర్లు బాదాడు. లహిరు కుమార నాలుగో ఓవర్లో పుల్ షాట్‌తో 6, మరో బౌండరీ సాధించాడు. అతని ధాటికి ఈ రెండు ఓవర్లలో 29 (15, 14) పరుగులొచ్చాయి.
వెంటనే బౌలర్లను మార్చినా... ఫలితం శూన్యం! జయవిక్రమ ఓవర్లో ఫోర్ కొట్టిన ఇషాన్ చమీరా వేసిన బుల్లెట్ బంతిని స్క్వేర్ లెగ్‌లోకి సిక్సర్‌గా తరలించాడు. 30 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. రోహిత్ అవుటయ్యాక కాస్త నెమ్మదించినట్లు కనిపించిన ఇషాన్ తిరిగి 16వ ఓవర్లో జూలు విదిల్చాడు. లహిరు బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4లతో 17 పరుగులు పిండుకున్నాడు. శతక్కొట్టే ఊపులో ఉన్న కిషన్‌ను షనక బోల్తా కొట్టించడంతో లంక శిబిరం ఊపిరిపీల్చుకుంది. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్..'' పూనకం వచ్చినట్లుగా ఆడాడు..'' అంటూ కామెంట్ చేశారు.
Video: ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్
చదవండి: Ishan Kishan: ఇషాన్ అరుదైన ఫీట్.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు
Comments
Please login to add a commentAdd a comment