ఫుట్‌బాల్ ఆటలో ఇరుజట్లు గోల్ కొట్టాలని ప్రయత్నిస్తాయి ఈ నేపథ్యంలో గోల్ అడ్డుకునే క్రమంలో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం అయితే ఒక్కోసారి అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా సెనెగల్, కేప్ వర్డేల మధ్య మ్యాచ్ జరిగింది.
చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి
ఆట 57వ నిమిషంలో సెనెగెల్ స్ట్రైకర్ సాడియో మానే, కేప్‌వర్డే గోల్‌కీపర్ వోజిన్హా ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. గోల్ కొట్టే క్రమంలో సాడియో మానే.. కేప్‌వర్డే నెట్స్ వైపు వేగంగా దూసుకొచ్చాడు. అదే సమయంలో గోల్ కీపర్ వోజిన్హా గోల్‌ను అడ్డుకునే క్రమంలో బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ మానే అతని పైనుంచి గోల్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునే క్రమంలో అతని తల ..మానే తలకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన మానే స్టేడియంలోనే కుప్పకూలాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి చికిత్స అవసరమని చెప్పాడు.
చదవండి: Australian Open 2022: పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు
కానీ మానే ఇదేం పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. గాయం బాధిస్తున్నా నొప్పిని పంటికింద అదిమి సరిగ్గా ఆరు నిమిషాలకు గోల్ కొట్టాడు. అలా సెనెగ్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత గోల్ కొట్టడంలో కేప్‌వర్డే విఫలం కావడంతో సెనెగల్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. కాగా మానేను ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు గోల్ కీపర్ వోజిన్హాకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపెట్టాడు. ఇక ఆదివారం మాలి వర్సెస్ ఈక్వెటోరియల్ జినియా మధ్య విజేతతో సెనెగల్ క్వార్టర్‌ఫైనల్లో తలపడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మానేను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం అయినప్పటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమి లేదని.. తర్వాతి మ్యాచ్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు మానే ఆసుపత్రిలో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
చదవండి: Mitchell Santner: మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
💥 NASTY HEAD COLLISION BETWEEN SADIO MANE AND YOSIMAR DIAS!
— beIN SPORTS USA (@beINSPORTSUSA) January 25, 2022
The goalkeeper was sent off after VAR review 🟥
Cape Verde down to nine men! 😱#TotalEnergiesAFCON2021 | #AFCON2021 | #SENCPV pic.twitter.com/GBGwasSHmk
Comments
Please login to add a commentAdd a comment