శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు వరుస పెట్టి గాయాల బారినపడుతున్నారు. శ్రీలంక చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకున్న ఘటన మరవక ముందే.. మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ యువ ఆటగాడు ఆజాం ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో క్యాండీ ఫాల్కన్స్‌కు ఆజాం ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన నువాన్ ప్రదీప్.. మూడో బంతిని బాగా స్లోగా వేశాడు. అది వైడ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ఆజాం ఖాన్ బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచానా వేయడంలో అజం విఫలమవ్వడంతో.. అది నేరుగా అతడి తలకి తాకింది.
దీంతో నేలపై పడుకుని అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజెయో వచ్చి అతడిని పరిశీలించాడు. అతడిని స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. అతడిని ఆసుపత్రికి తరలించిన వెంటనే స్కానింగ్ చేశారు. స్కాన్ రిపోర్టులు పరిశీలించిన వైద్యలు అతడు బాగానే ఉన్నాడని తెలిపారు. దీంతో పాక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆజాం ఖాన్ పాకిస్తాన్ దిగ్గజం మొయీన్ ఖాన్ తనయడు అన్న సంగతి తెలిసిందే.
Azam Khan got injured of Galle Gladiators in LPL during T20 Match.#LPL2022 #Cricket #T20 pic.twitter.com/hJGKP79YDD
— Ada Derana Sports (@AdaDeranaSports) December 12, 2022
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు ఏమైంది? స్టేడియంలోకి అంబులెన్స్! ఆసుపత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment