
విజయేంద్ర త్యాగి కాలుకు చికిత్స చేసిన వైద్యుడు
న్యూఢిల్లీ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య కడుపు నొప్పని వచ్చిన ఓ మహిళకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు డయాలసిస్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయేంద్ర త్యాగి అనే వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు ఢిల్లీలోని సుశ్రుత ట్రామా సెంటర్‌కు వెళ్లాడు. అయితే అదే రోజు కాలు విరగడంతో వీరేంద్ర అనే మరో వ్యక్తి అదే ఆస్పత్రిలో చేరాడు.
వీరి పేర్ల విషయంలో అయోమయానికి గురైన డాక్టర్.. ఒకరికి చేయాల్సిన వైద్యం మరోకరి చేశాడు. కాలు విరిగిన వీరేంద్రకు అందించాల్సిన చికిత్సను విజయేంద్ర త్యాగికి అందించాడు. చికిత్సలో భాగంగా అతడి కాలికి రంధ్రం చేశాడు. మత్తులో ఉండటంతో అతడికి కూడా ఏమీ అర్థం కాలేదు. పేషంట్‌కు మెలకువ వచ్చిన అనంతరం అసలు విషయం తెలుసుకున్న వైద్యుడు కంగుతిన్నాడు. వెంటనే మళ్లీ తలకు సంబంధించిన చికిత్స చేసి తప్పించుకోవాలని చూశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విజయేంద్ర త్యాగి కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సూపరిండెంటెండ్ అజయ్ భాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment