leg surgery
-
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య 'భోళా శంకర్' పూర్తి చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలు అలరిస్తుండగా, జూలై 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రీసెంట్గా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరు.. తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారు. కానీ మెడికల్ పనిమీద వెళ్లినట్లు సమాచారం. చిన్న సర్జరీ 'భోళా శంకర్' సినిమాను చిరు పూర్తి చేసినప్పటికీ.. గత కొన్నాళ్ల నుంచి ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే అమెరికా టూర్ ప్లాన్ చేశారు. రిలీఫ్‌తో పాటు చిన్నపాటి సర్జరీ పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత సీక్రెట్‌గా ఉంచినప్పటికీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఆ విషయం బయటకొచ్చేసింది. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) నో కంగారు అసలు సమస్య ఏంటి? సర్జరీ ఏం జరిగింది? లాంటి విషయాలు ప్రస్తుతం ఏం తెలియదు. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఏమంత పెద్దది కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని చిరు సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఎయిర్‌పోర్ట్‌లో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి కంగారు పడాల్సిందేం లేదని సన్నిహితులు అంటున్నారు. నెక్స్ట్ ఆ సినిమా 'భోళా శంకర్'.. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. కాబట్టి త్వరలో చిరు ప్రమోషన్లకు హాజరవుతారు. అలానే కూతురు సుస్మిత నిర్మాణంలో కొత్త సినిమా కూడా మొదలుపెడతారు. ఇందులో మెగాస్టార్‌తో పాటు త్రిష, సిద్ధు, శ్రీలీల నటిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని అంటున్నారు. క్లారిటీ రావాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) -
కమల్ కాలుకు సర్జరీ..
విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో ఇటీవల ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యులు ఆయన కాలికి శస్త్ర చికిత్స చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు మంగళవారం కమల్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కుడి కాలు ఎముకకు స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా కమల్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు వివరించారు. దీంతో ఆయన కాలికి సర్జరీ చేశామన్నారు. ప్రస్తుతం కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. కమల్ కోలుకుంటున్నారని మరో 4, 5 రోజుల్లో డిశ్చార్జీ కానున్నారని వైద్యులు తెలిపారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కమలహాసన్ కొన్ని నెలలుగా ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కమల్ ప్రణాళిక వేసి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. -
నాలోని నన్ను వెతుక్కుంటా!
దాదాపు మూడేళ్ల క్రితం ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా మోహన్. ఆ తర్వాత ‘యన్టీఆర్: కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లో కనిపించారీ మలయాళీ బ్యూటీ. తెలుగులో కెరీర్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ తమిళంలో ఫుల్ జోష్‌గా సినిమాలు చేస్తున్నారామె. అయితే మంజిమా కాలికి గాయం కావడంతో ఆ జోష్‌కు బ్రేక్ పడింది. ‘‘రెండు వారాల క్రితం నా జీవితంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారణంగా రాబోయే నెల రోజులు నేను బెడ్‌కే పరిమితమవ్వాల్సి వస్తోంది. నాకు ఇష్టమైన నటనకు కొంత సమయం దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉంది. కానీ నాలోని నన్ను వెతుక్కోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఇంతకుముందు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఏంటి? అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు ‘ఏమీ లేవు’ అని చెప్పేదాన్ని. ఇకపై ఆ ప్రశ్నకు సమాధానం మార్చి, ఈ పరిస్థితుల గురించి చెబుతాను’’ అని పేర్కొన్నారు మంజిమ. -
మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు
సాక్షి, విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలో తెగిపడి ఉన్న కాలు ఎముకలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మనిషి కాలు అక్కడకు ఏలా వచ్చిందన్న దానిపై సర్వత్రా చర్చించుకున్నారు. ఎవరైనా నరికి పడేశారా.. లేదా సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేసి కాలు తొలిగించి పడేశారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో ఆస్పత్రిలో తొలగించబడిన కాలు ఎముకలని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలియజేసిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట మయూరి హోటల్‌కు సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఓ మ«ధుమేహ రోగి వచ్చారు. అతని కాలు కుళ్లిపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలిగించి, బయోవేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించే సంస్థకు అప్పగించారు. అయితే వారు వాహనంలో తరలిస్తుండగా కాలు జారి పడిందని సమాచారం. ప్రస్తుతం ఆ కాలును ఆస్పత్రి వైద్య సిబ్బంది భద్రపరిచారు. -
తలకు దెబ్బ తగిలిందని వెళ్తే..
న్యూఢిల్లీ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య కడుపు నొప్పని వచ్చిన ఓ మహిళకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు డయాలసిస్ చేశారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయేంద్ర త్యాగి అనే వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు ఢిల్లీలోని సుశ్రుత ట్రామా సెంటర్‌కు వెళ్లాడు. అయితే అదే రోజు కాలు విరగడంతో వీరేంద్ర అనే మరో వ్యక్తి అదే ఆస్పత్రిలో చేరాడు. వీరి పేర్ల విషయంలో అయోమయానికి గురైన డాక్టర్.. ఒకరికి చేయాల్సిన వైద్యం మరోకరి చేశాడు. కాలు విరిగిన వీరేంద్రకు అందించాల్సిన చికిత్సను విజయేంద్ర త్యాగికి అందించాడు. చికిత్సలో భాగంగా అతడి కాలికి రంధ్రం చేశాడు. మత్తులో ఉండటంతో అతడికి కూడా ఏమీ అర్థం కాలేదు. పేషంట్‌కు మెలకువ వచ్చిన అనంతరం అసలు విషయం తెలుసుకున్న వైద్యుడు కంగుతిన్నాడు. వెంటనే మళ్లీ తలకు సంబంధించిన చికిత్స చేసి తప్పించుకోవాలని చూశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విజయేంద్ర త్యాగి కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సూపరిండెంటెండ్ అజయ్ భాల్ తెలిపారు. -
కమల్‌కు రజనీకాంత్ పరామర్శ
శభాష్ నాయుడు పేరుతో దశావతారం సినిమాకు సీక్వెల్ చేస్తున్న హీరో కమలహాసన్ కుడికాలుకు రెండోసారి ఆపరేషన్ జరిగింది. అమెరికాలో శభాష్ నాయుడు సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న కమల్.. గతనెల 13న చెన్నైకి తిరిగొచ్చారు. తర్వాతి షెడ్యూల్ గురించి చర్చించి మేడ మీద నుంచి కిందకు వస్తుండగా మెట్లపైనుంచి జారిపడ్డారు. దాంతో ఆయన కుడికాలు విరిగింది. దాంతో చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ చేసిన కాలు మళ్లీ నొప్పి పుడుతుండటంతో వైద్యులు ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు. కాగా, ఇటీవలే అమెరికా నుంచి చెన్నై వచ్చిన హీరో రజనీకాంత్.. స్వయంగా కమల్‌ను కలిసి పరామర్శించాలని భావించారు. అయితే రెండోసారి ఆపరేషన్ జరగడంతో అందుకు డాక్టర్లు అనుమతించలేదు. ఇక చేసేది లేక ఫోన్లోనే కమలహాసన్‌ను రజనీకాంత్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
మంత్రి ఈటల కాలుకు నేడు శస్త్రచికిత్స
హుజూరాబాద్/కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర ఆర్థిక,పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎడమ కాలుకు గురువారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శస్త్రచికి త్స చేయనున్నారు. ఆయన ఎడమ మోకాలులో నరం ఇబ్బందిగా ఉండడం. నొప్పి తీవ్రంగా ఉండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి అవసరం ఉంటుం దని వైద్యులు చెప్పిన ట్లు తెలిసింది. ఈ సమయంలో సందర్శకులు మంత్రిని కలిసే అవకాశం ఉండదని ప్రకటించారు. పరామర్శల వెల్లువ మంత్రి ఈటల రాజేందర్‌ను జిల్లాకు చెందిన ఆయా పార్టీల ముఖ్య నేతలు బుధవారం పరామర్శించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయన సతీమణి ఎంపీపీ వొడితెల సరోజినిదేవి మంత్రిని పరామర్శించారు. హుజూరాబాద్ జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, పట్టణ కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మహిళా నేత జన్ను స్వరూప, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కొయ్యడ శ్రీదేవి, 14వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ కమలాకర్‌గౌడ్, తెలంగాణ ముస్లీం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్‌హుస్సేన్, ముస్లిం నాయకులు మంజూర్ హుస్సేన్, మునీరొద్దీన్, అజీజ్, రియాజుద్దీన్ తదితరులు మంత్రిని కలుసుకున్నారు.