మయూరీ హోటల్ ముందు పడి ఉన్న కాలు
సాక్షి, విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలో తెగిపడి ఉన్న కాలు ఎముకలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మనిషి కాలు అక్కడకు ఏలా వచ్చిందన్న దానిపై సర్వత్రా చర్చించుకున్నారు. ఎవరైనా నరికి పడేశారా.. లేదా సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేసి కాలు తొలిగించి పడేశారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే పోలీసుల విచారణలో ఆస్పత్రిలో తొలగించబడిన కాలు ఎముకలని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలియజేసిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట మయూరి హోటల్‌కు సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఓ మ«ధుమేహ రోగి వచ్చారు. అతని కాలు కుళ్లిపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలిగించి, బయోవేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహించే సంస్థకు అప్పగించారు. అయితే వారు వాహనంలో తరలిస్తుండగా కాలు జారి పడిందని సమాచారం. ప్రస్తుతం ఆ కాలును ఆస్పత్రి వైద్య సిబ్బంది భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment