మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య 'భోళా శంకర్' పూర్తి చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలు అలరిస్తుండగా, జూలై 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రీసెంట్‌గా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరు.. తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారు. కానీ మెడికల్ పనిమీద వెళ్లినట్లు సమాచారం.
చిన్న సర్జరీ
'భోళా శంకర్' సినిమాను చిరు పూర్తి చేసినప్పటికీ.. గత కొన్నాళ్ల నుంచి ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే అమెరికా టూర్ ప్లాన్ చేశారు. రిలీఫ్‌తో పాటు చిన్నపాటి సర్జరీ పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత సీక్రెట్‌గా ఉంచినప‍్పటికీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఆ విషయం బయటకొచ‍్చేసింది.
(ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!)
నో కంగారు
అసలు సమస్య ఏంటి? సర్జరీ ఏం జరిగింది? లాంటి విషయాలు ప్రస్తుతం ఏం తెలియదు. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఏమంత పెద్దది కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని చిరు సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఎయిర్‌పోర్ట్‌లో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి కంగారు పడాల్సిందేం లేదని సన్నిహితులు అంటున్నారు.
నెక్స్ట్ ఆ సినిమా
'భోళా శంకర్'.. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. కాబట్టి త్వరలో చిరు ప్రమోషన్లకు హాజరవుతారు. అలానే కూతురు సుస్మిత నిర్మాణంలో కొత్త సినిమా కూడా మొదలుపెడతారు. ఇందులో మెగాస్టార్‌తో పాటు త్రిష, సిద్ధు, శ్రీలీల నటిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని అంటున్నారు. క్లారిటీ రావాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.
(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)
Comments
Please login to add a commentAdd a comment