మంత్రి ఈటల కాలుకు నేడు శస్త్రచికిత్స
హుజూరాబాద్/కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాష్ట్ర ఆర్థిక,పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎడమ కాలుకు గురువారం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శస్త్రచికి త్స చేయనున్నారు. ఆయన ఎడమ మోకాలులో నరం ఇబ్బందిగా ఉండడం. నొప్పి తీవ్రంగా ఉండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి అవసరం ఉంటుం దని వైద్యులు చెప్పిన ట్లు తెలిసింది. ఈ సమయంలో సందర్శకులు మంత్రిని కలిసే అవకాశం ఉండదని ప్రకటించారు.
పరామర్శల వెల్లువ
మంత్రి ఈటల రాజేందర్‌ను జిల్లాకు చెందిన ఆయా పార్టీల ముఖ్య నేతలు బుధవారం పరామర్శించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయన సతీమణి ఎంపీపీ వొడితెల సరోజినిదేవి మంత్రిని పరామర్శించారు.
హుజూరాబాద్ జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, పట్టణ కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, మహిళా నేత జన్ను స్వరూప, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కొయ్యడ శ్రీదేవి, 14వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ కమలాకర్‌గౌడ్, తెలంగాణ ముస్లీం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్‌హుస్సేన్, ముస్లిం నాయకులు మంజూర్ హుస్సేన్, మునీరొద్దీన్, అజీజ్, రియాజుద్దీన్ తదితరులు మంత్రిని కలుసుకున్నారు.