దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది.
గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇండియా ‘రెడ్’ జట్టుతో శనివారం మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇండి యా ‘బ్లూ’ జట్టు 90 ఓవర్లలో మూడు వికెట్లకు 362 పరుగులు సాధించింది. మయాంక్ అగర్వాల్ (7 ఫోర్లతో 57), గౌతమ్ గంభీర్ (8 ఫోర్లతో 94) తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించారు. అజేయ శతకం సాధించిన చతేశ్వర్ పుజారా (15 ఫోర్లతో 111 బ్యాటింగ్)తో కలిసి దినేశ్ కార్తీక్ (8 ఫోర్లతో 55 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ‘రెడ్’ జట్టు బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.