
లక్నో: ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 187 పరుగులు చేసి ఓవరాల్ ఆధిక్యాన్ని 371 పరుగులకు పెంచుకుంది. సుందర్ (42 బ్యాటింగ్), సిద్ధార్థ్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 181/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘బ్లూ’ 299 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇండియా ‘రెడ్’ జట్టుకు 184 పరుగుల ఆధిక్యం లభించింది.