దులీప్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి ‘పింక్’ బాల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా రెడ్ 219
ఇండియా గ్రీన్‌తో మ్యాచ్
దులీప్ ట్రోఫీ
గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి ‘పింక్’ బాల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా రెడ్ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 497 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా గ్రీన్ చివరి రోజు శుక్రవారం 56.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. కెప్టెన్ సురేశ్ రైనా (101 బంతుల్లో 90; 11 ఫోర్లు; 3 సిక్సర్లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు వికెట్లతో చెలరేగి రెడ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 217/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించిన గ్రీన్ జట్టు కేవలం 10.2 ఓవర్లలో మిగిలిన మూడు వికెట్లను కోల్పోరుుంది. ఈ విజయంతో ఇండియా రెడ్ ఆరు పారుుంట్లు సాధించి ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సోమవారం నుంచి ఇండియా బ్లూ, రెడ్ బ్రిగేడ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.
భిన్న అభిప్రాయాలు: ప్రయోగాత్మకంగా జరిగిన నాలుగు రోజుల ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌పై ఆటగాళ్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి బంతి లైట్ పింక్, ఆరెంజ్‌లాగా కనిపిస్తుండగా ఫ్లడ్ లైట్ల కింద పూర్తి పింక్ కలర్‌గా కనిపిస్తోందని ఇండియా గ్రీన్ ఆటగాడు ఉతప్ప చెప్పాడు. అలాగే రివర్స్ స్వింగ్ చేయడం చాలా కష్టంగా ఉందని ఉతప్ప, పార్థీవ్ పటేల్ అన్నారు.