భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు.
సూర్యకుమార్ యాదవ్ (వెస్ట్ జోన్), చతేశ్వర్ పుజారా (వెస్ట్ జోన్) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్ (సెంట్రల్ జోన్), తిలక్ వర్మ (సౌత్ జోన్), సాయి సుదర్శన్ (సౌత్) లాంటి ఐపీఎల్ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ (వెస్ట్) దులీప్ ట్రోఫీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు.
కాగా, దులీప్ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ KSCA క్రికెట్ గ్రౌండ్‌లో, ఆలుర్ (కర్ణాటక), రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్ జోన్‌తో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment