23నుంచి దులీప్ ట్రోఫీ
తొలిసారి పింక్ బాల్‌తో టోర్నీ
ముంబై: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ప్రయోగాత్మకంగా మొదటి సారి గులాబీ బంతులతో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుగులో గ్రేటర్ నోయిడా స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. దులీప్ ట్రోఫీలో జోనల్ పద్ధతిని రద్దు చేసి కొత్తగా ఇండియా రెడ్, బ్లూ, గ్రీన్ పేర్లతో జట్లను విభజించారు. మూడు లీగ్ మ్యాచ్‌ల తర్వాత సెప్టెంబర్ 10నుంచి 14 వరకు ఫైనల్ జరుగుతుంది. మూడు జట్లకు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, గౌతం గంభీర్ కెప్టెన్లుగా వ్యవహరించనన్నారు. బ్లూ జట్టులో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారికి చోటు దక్కింది.