చెన్నై: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. చెపాక్ మైదానంలో వెస్ట్‌జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. దీంతో సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 313 పరుగుల భారీ ఆధిక్యం సహాయంతో సెమీస్ బరిలో నిలిచింది.
చివరి రోజు వెస్ట్ జట్టు అంకిత్ బావ్నె (337 బంతుల్లో 115 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అజేయ సెంచరీ సహాయంతో తమ తొలి ఇన్నింగ్స్‌ను 133 ఓవర్లలో 287 పరుగుల వద్ద ముగించింది. రాకేశ్ ధృవ్ (107 బంతుల్లో 53; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఎం.రంగరాజన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ 22.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అక్షత్ రెడ్డి (66 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు నాలుగో రోజు 156/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన వెస్ట్‌జోన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేట్టు కనిపించినా బావ్నె, ధృవ్ జోడి సౌత్ జోన్ విజయావకాశాలను అడ్డుకుంది. 40.3 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన వీరు ఏడో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. బావ్నె తన ఏడో ఫస్ట్‌క్లాస్ సెంచరీ సాధించాడు. ధృవ్ వికెట్ పడగానే మిగతా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే మిగతా మూడు వికెట్లు నేలకూలాయి.
దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సౌత్‌జోన్
Published Mon, Oct 7 2013 1:28 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement