quarterfinal match
-
22 ఫోర్లు.. 3 సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కేరళతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక 80 పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ చేరింది. ఓపెనర్లు సమర్థ్ (192; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (101; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. తొలి వికెట్‌కు 249 పరుగులు జోడించారు. కాగా ఓపెనర్ సమర్థ్ ఇన్నింగ్స్ ఆసాంతం ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడేశాడు. అయితే తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఇక టోర్నీలో దేవదత్కిది వరుసగా నాలుగో సెంచరీ. కర్ణాటక 50 ఓవర్లలో 3 వికెట్లకు 338 పరుగులు చేసింది. అనంతరం కేరళ 43.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్ రోణిత్ మోరే 5 వికెట్లతో విజృంభించాడు. ఆంధ్ర జట్టుకు నిరాశ ఢిల్లీ: ఇక లీగ్ దశలో తమ గ్రూప్‌లో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచిన ఆంధ్ర జట్టు నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. గుజరాత్ జట్టుతో సోమ వారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు 117 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత గుజరాత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 299 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (134; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఆంధ్ర 41.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. చదవండి: WTC: ఫైనల్ జరిగేది ఎక్కడో తెలుసా? అదిరిపోయే క్యాచ్.. విండీస్‌దే టీ20 సిరీస్! -
దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సౌత్‌జోన్
చెన్నై: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. చెపాక్ మైదానంలో వెస్ట్‌జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. దీంతో సౌత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 313 పరుగుల భారీ ఆధిక్యం సహాయంతో సెమీస్ బరిలో నిలిచింది. చివరి రోజు వెస్ట్ జట్టు అంకిత్ బావ్నె (337 బంతుల్లో 115 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అజేయ సెంచరీ సహాయంతో తమ తొలి ఇన్నింగ్స్‌ను 133 ఓవర్లలో 287 పరుగుల వద్ద ముగించింది. రాకేశ్ ధృవ్ (107 బంతుల్లో 53; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఎం.రంగరాజన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ 22.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అక్షత్ రెడ్డి (66 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు నాలుగో రోజు 156/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన వెస్ట్‌జోన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగేట్టు కనిపించినా బావ్నె, ధృవ్ జోడి సౌత్ జోన్ విజయావకాశాలను అడ్డుకుంది. 40.3 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన వీరు ఏడో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. బావ్నె తన ఏడో ఫస్ట్‌క్లాస్ సెంచరీ సాధించాడు. ధృవ్ వికెట్ పడగానే మిగతా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే మిగతా మూడు వికెట్లు నేలకూలాయి.