నాలుగో రోజు వర్షం ఆటంకం | The fourth day of the rain interruption | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు వర్షం ఆటంకం

Published Wed, Sep 14 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

The fourth day of the rain interruption

గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగో రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ రెండో ఇన్నింగ్‌‌సలో 35 ఓవర్లలో మూడు వికెట్లకు 139 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (83 బంతుల్లో 52; 6 ఫోర్లు), గంభీర్ (59 బంతుల్లో 36; 5 ఫోర్లు) రాణించారు. కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా క్రీజులో రోహిత్ (48 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్), జడేజా (3 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం బ్లూ జట్టు 476 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement