fourth day
-
నాలుగో రోజూ లాభాలు
ముంబై: ఐటీ, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు సెంటిమెంట్‌ను మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు లాభపడి 72,427 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 130 పాయింట్లు పెరిగి 22 వేల స్థాయిపై 22,041 వద్ద ముగిసింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. భారత వాణిజ్య లోటు 9 నెలల కనిష్టానికి దిగిరావడంతో క్యాపిటల్ గూడ్స్, మెటల్, పారిశ్రామిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇటీవల ర్యాలీ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,218 వద్ద కనిష్టాన్ని, 72,545 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,969 – 22,069 శ్రేణిలో ట్రేడైంది. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.68%, 0.78 % చొప్పున రాణించాయి. ► ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.1,258)తో పోలిస్తే 1% డిస్కౌంట్‌తో రూ.1245 వద్ద లిస్టయ్యింది. 9.22 % నష్టపోయి రూ.1142 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.50% క్షీణించి రూ.1149 వద్ద ముగిసింది. ► వరుస పతనాల నుంచి పేటీఎం షేరు కోలు కుంది. దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 5% ఎగసి రూ. 341.50 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
నాలుగో టి20.. గెలిస్తే సిరీస్ వశం
ఫ్లోరిడా: అమెరికా గడ్డపై సిరీస్ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు వెస్టిండీస్‌తో నాలుగో టి20లో తలపడనుంది. నేడు, రేపు వరుసగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో భారత్ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం చాలు. కానీ విండీస్ పరిస్థితి భిన్నం. ఈ రెండూ గెలిస్తేనే పొట్టి సిరీస్ దక్కుతుంది. లేదంటే వన్డే సిరీస్‌ను అప్పగించినట్లే టి20 సిరీస్‌ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఎక్కువగా టి20లే ఆడుతోంది. వరల్డ్‌కప్ బెర్త్ దక్కాలంటే దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్లు మెరుపులు మెరిపించాల్సిందే. కాబట్టి ఇకపై వీళ్లకి ప్రతీ మ్యాచ్ కూడా ఫైనల్ పరీక్షలాంటిదే. రెండు రోజుల్లో రెండూ గెలవాల్సిన ఒత్తిడిలో వెస్టిండీస్ ఉంది. రెండో టి20లో బౌలింగ్‌తో బెదరగొట్టిన కరీబియన్ బౌలర్లు గత మ్యాచ్‌లో తేలిపోయారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు. మెద్వెదెవ్ కష్టపడి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
TS Assembly Sessions: ‘కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది’
► అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మట్లాడుతూ.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. పద్మ శ్రీ అవార్డుల విషయంలో రాష్ట్రంపై విపక్ష చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉందని అన్నారు. పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. పధాని, హోం మంత్రిని కలిసినా ప్రయోజనం లేదని తెలిపారు. ► హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. పాతబస్తీ అభివృద్ధిపై సమగ్ర చర్చ జరుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. చెరువులకు చైన్ సిస్టమ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో నాలాల విస్తరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతోంది. అనంతరం ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పించనున్నారు. శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ జరుగుతుంది. అదేవిధంగా శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగనుంది. -
టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఆతిధ్య జట్టు చేతిలో ఇన్నింగ్స్ 76 పరగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఓవర్‌నైట్ స్కోర్ 215/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ తొలి సెషన్లోనే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి టీమిండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 63 పరుగులు జోడించి 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు రాబిన్సన్(5/65), ఒవర్టన్(3/47) టీమిండియా పతనాన్ని శాసించారు. ఆండర్సన్, మొయిన్ అలీకి తలో వికెట్ దక్కింది. కాగా, ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో టెస్ట్‌లో భారత్ గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, మూడో టెస్ట్‌లో ఆతిధ్య జట్టు గెలుపొందడంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానుంది. ఇన్నింగ్స్ ఓటమి దిశగా టీమిండియా.. తొమ్మిదో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ ఓటమికి టీమిండియా మరో వికెట్ దూరంలో ఉంది. ఒవర్టన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా(30) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 278/9. ఇన్నింగ్స్ పరాభవాన్ని తప్పించుకోవాలంటే మరో 76 పరుగులు చేయాల్సి ఉంది. రాబిన్సన్కు ఐదు వికెట్లు.. ఇషాంత్(2) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ ఖాతాలో మరో వికెట్ పడింది. వికెట్‌కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాంత్(2) వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో రాబిన్సన్ ఒకే ఇన్నింగ్సలో 5వికెట్ల ఘనతను రెండోసారి సాధించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 257/8. ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే భారత్ మరో 97 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో జడేజా, బుమ్రా ఉన్నారు. టీమిండియాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా లేదు.. షమీ(6) ఔట్ మూడు టెస్ట్‌లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పేలా లేదు. నాలుగో రోజు తొలి సెషన్లో వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్న భారత ఆటగాళ్లు కనీసం ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకుందాం అన్న ధ్యాస లేకుండా వికెట్లు సమర్పించుకుంటున్నారు. 239 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్ మరో 15 పరుగులు జోడించి 254 పరుగుల వద్ద ఏడో వికెట్(షమీ)ను కోల్పోయింది. షమీ(6) ని మొయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే టీమిండియా మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. రాబిన్సన్ విజృంభణ.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా, పంత్(1) ఔట్ ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా ఆటగాళ్లను కుదురుకోనివ్వట్లేదు. నాలుగో రోజు ఆటలో తొలుత పుజారాను ఔట్ చేసిన రాబిన్సన్.. ఆతర్వాత కోహ్లిని, తాజాగా పంత్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియా ఓటమికి బాటలు వేస్తున్నాడు. రాబిన్సన్(4/58) ధాటికి భారత్ 239 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో జడేజా, షమీ ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 115 పరుగులు చేయాల్సి ఉంది. ఓటమి బాట పట్టిన టీమిండియా.. వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) ఔట్ నాలుగో రోజు తొలి సెషన్లోనే టీమిండియా ఖేల్ ఖతం అయ్యేలా కనిపిస్తుంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే పుజారా(91) వెనుదిరగగా, తాజాగా వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) పెవిలియన్ బాట పట్టారు. దీంతో టీమిండియా 239 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపు ఖరారు చేసుకుంది. కోహ్లి రాబిన్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, రహానేను ఆండర్సన్ బోల్తా కొట్టించాడు. క్రీజ్‌లో పంత్(1), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ మరో 115 పరుగులు వెనుకబడే ఉంది. అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ టీమిండియా అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పుజారా(91) తన ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే రాబిన్సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు చిక్కాడు. దీంతో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. క్రీజ్‌లోకి రహానే వచ్చాడు. లీడ్స్: తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లో పుజారా, కోహ్లి ఓపికగా ఆడగలిగితే టీమిండియాదే పైచేయి అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ రోజు ఆటలో మనోళ్లు నిలబడతారా..? లేక చేతులెత్తేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు -
20 పరుగులకే ఔట్.. డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్ విసిరి కొట్టిన కోహ్లి
లండన్: లార్డ్స్ టెస్టు 4వ రోజు విరాట్ కోహ్లీ 20 పరుగులకే వెనుదిరిగాడు. అయితే దీనిపై కోహ్లీ తన నిరాశను ప్రదర్శిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్‌ను విసిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై కొంత మంది నెటిజన్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో యాభై పరుగులు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. ఇక కోహ్లీ స్కోర్లు వరుసగా 0, 62, 27, 0, 44,13, 0, 42, 20 గా ఉన్నాయి. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘కోహ్లీ! ఎంత సమయమైన తీసుకో.. కానీ మళ్లీ నీ ప్రతాపం చూడాలి. నీ ఆటతో విమర్శించే వాళ్ల నోళ్లు మూయించాలి. దాని కోసం నేను వేచి ఉంటాను.’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. కాగా భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు టీమిండియా బ్యాటింగ్ దళం వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఈ ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. మూడో సెషన్లో కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. 👀 pic.twitter.com/vjhglznWvk — . (@aikdoteenchaar) August 15, 2021 -
రసపట్టులో.. భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
తొలి టెస్టులో చివరి రోజు వర్షం శాసించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించినా... రెండో టెస్టులో మాత్రం భారత్, ఇంగ్లండ్ జట్లలో ఒక జట్టు గెలుపు రుచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రహానే మొండి పట్టుదలతో ఆడి ఆదుకునే ప్రయత్నం చేయగా... మార్క్ వుడ్, మొయిన్ అలీ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉండగా... ఆఖరి రోజు భారత్‌ను సాధ్యమైనంత తొందరగా ఆలౌట్ చేయడంపై ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి లార్డ్స్ టెస్టులో చివరిదైన ఐదో రోజు ఆద్యంతం ఆసక్తికరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. లండన్: మూడో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. నాలుగో రోజు మ్యాచ్‌పైనే పట్టు సాధించే పరిస్థితిని సృష్టించుకుంది. ఆతిథ్య జట్టు పేస్–స్పిన్‌ల కలబోత భారత్‌ను కష్టాలపాలు చేసింది. పేసర్ మార్క్ వుడ్ (3/40) ‘టాప్’ లేపగా... స్పిన్నర్ మొయిన్ అలీ (2/52) పాతుకుపోతున్న భారత ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో అజింక్య రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) జట్టును ఆదుకునేందుకు చేసిన పోరాటం ఆఖరిదాకా నిలువలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (14 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ చేతిలో ఒక బ్యాట్స్‌మనే ఉన్నాడు. మిగతా వాళ్లంతా బౌలర్లే! వణికించిన వుడ్ భారత ఓపెనింగ్ జోడీ రాహుల్–రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్ పేస్‌కు వణికింది. 27 పరుగుల లోటుతో మొదలైన భారత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ సీమర్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. వుడ్ తన వరుస ఓవర్లలో రాహుల్ (5), రోహిత్ (36 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)లను పెవిలియన్ పంపాడు. 12 ఓవర్లలో 27 పరుగులకే ఈ రెండు వికెట్లు పడ్డాయి. పుజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. కానీ ఈ జోడీ ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 55 పరుగుల వద్ద కోహ్లి (31 బంతుల్లో 20; 4 ఫోర్లు)ని స్యామ్ కరన్ ఔట్ చేశాడు. క్రీజులోకి రహానే రాగా... 56/3 స్కోరు వద్ద మనోళ్లు లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. రహానే అర్ధసెంచరీ తర్వాత భారత్ ఆత్మరక్షణలో పడింది. రహానే, పుజారా పూర్తిగా వికెట్లు కాపాడుకునేందుకే పరిమితమయ్యారు. దాంతో పరుగుల వేగం మందగించింది. దీంతో ఈ రెండో సెషన్లో 28 ఓవర్లు ఆడినా కూడా భారత్ 50 పరుగులు చేయలేకపోయింది. ఓవర్‌కు 2 పరుగుల రన్‌రేట్‌తో ఎట్టకేలకు 51 ఓవర్లో జట్టు స్కోరు 100కు చేరుకుంది. వికెట్ కాపాడుకున్న ప్రయోజనం నెరవేరడంతో 105/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. ఆఖరి సెషన్లోనూ ఇద్దరు నెమ్మదిగానే ఆడారు. ఈ క్రమంలో 125 బంతుల్లో 5 బౌండరీలతో రహానే ఫిఫ్టీ పూర్తయింది. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక మార్క్ వుడ్ మళ్లీ కుదుపేశాడు. పుజారాను ఔట్ చేశాడు. తర్వాత మొయిన్ అలీ స్వల్ప వ్యవధిలో రహానే పోరాటానికి చెక్ పెట్టి... రవీంద్ర జడేజా (3)నూ బౌల్డ్ చేశాడు. దీంతో మూడో సెషన్ భారత్‌కు మళ్లీ ముప్పు తెచ్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391; భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) స్యామ్ కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) మొయిన్ అలీ 61; పంత్ (బ్యాటింగ్) 14; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (82 ఓవర్లలో 6 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175. బౌలింగ్: అండర్సన్ 18–6–23–0, రాబిన్సన్ 10–6–20–0, వుడ్ 14–3–40–3; స్యామ్ కరన్ 15–3–30–1, మొయిన్ అలీ 20–1–52–2, రూట్ 5–0–9–0. -
చెన్నైలో గెలుస్తారా, మనోళ్లు నిలుస్తారా!
టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక పరుగుల ఛేదన 418 పరుగులు... ఇప్పుడు భారత్ ముందు దానికంటే మరో రెండు పరుగుల ఎక్కువ విజయ లక్ష్యం నిలిచింది. అందుబాటులో కనీసం 90 ఓవర్లు ఉండగా, తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కొన్నాళ్లుగా టీమిండియా పఠిస్తున్న దూకుడు మంత్రంతో ఈ లక్ష్యాన్ని సాధించే సాహసం చేస్తుందా లేక ఆత్మ రక్షణ ధోరణిలో ఆడి ‘డ్రా’గా ముగిస్తే చాలని ప్రయత్నిస్తుందా అనేది ఆసక్తికరం. ఎన్నో ఏళ్లలో భారత జట్టుకు సొంతగడ్డపై ఎదురుకాని పరిస్థితి ఇది! భారత్‌ను ఈ స్థితిలో పడేసిన ఇంగ్లండ్ మాత్రం తొమ్మిది వికెట్లు తీయడమే లక్ష్యంగా గెలుపుపై గురి పెట్టింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్, గింగిరాలు తిరుగుతూ వెళ్లిన కొన్ని బంతులు పర్యాటక జట్టుకు విజయంపై ఆశలు రేపుతున్నాయి. తమ బౌలర్ల ప్రతిభతో మ్యాచ్ నాలుగో రోజు ఏకంగా 241 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్ ఇవ్వకుండా రూట్ సేన రెండో ఇన్నింగ్స్ ఆడగా... భారత్ మెరుగైన బౌలింగ్‌తో కట్టడి చేయగలిగింది. ఆరు వికెట్లతో అశ్విన్ ఇందులో కీలకపాత్ర పోషించడం విశేషం. చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరిత ఘట్టానికి చేరింది. 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12) పెవిలియన్ చేరగా, ప్రస్తుతం శుబ్‌మన్ గిల్ (15 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చివరిరోజు భారత్ విజయం కోసం మరో 381 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. 80 పరుగులు...4 వికెట్లు... సొంత మైదానంలో సుందర్, అశ్విన్ (91 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్)ల భాగస్వామ్యం భారత జట్టుకు కాస్త చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. ఓవర్‌నైట్ స్కోరు 257/6తో సోమవారం ఆటను కొనసాగిస్తూ వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 82 బంతుల్లో సుందర్ టెస్టుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక అశ్విన్‌ను అవుట్ చేసి లీచ్ ఈ జంటను విడగొట్టాడు. ఆ తర్వాత ఒకవైపు సుందర్ ధాటిగా ఆడినా... మరో ఎండ్‌లో నదీమ్ (0), ఇషాంత్ (4), బుమ్రా (0) నిలబడలేకపోవడంతో ఇంగ్లండ్ స్కోరుకు చాలా దూరంలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. రూట్ మినహా... రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు జోడిద్దామని భావించిన ఇంగ్లండ్ ఆ ప్రయత్నంలో కొంత వరకే సఫలమైంది. భారీ ఆధిక్యంతో ఆట ప్రారంభించిన ఆ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. అశ్విన్ చక్కటి బౌలింగ్‌ను ఆడలేక రోరీ బర్న్స్ (0) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో రూట్ మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. సిబ్లీ (16)ని కూడా అశ్విన్ పెవిలియన్ పంపించగా... లారెన్స్ (18)ను అవుట్ చేసి ఇషాంత్ కెరీర్లో 300వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రూట్ మాత్రం అశ్విన్, నదీమ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే స్టోక్స్ (7) విఫలం కాగా, రూట్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన ఒలీ పోప్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) నదీమ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అంతే?... ఈ వికెట్‌తో ఇంగ్లండ్ దృక్పథం మారిపోయింది. అప్పటి వరకు జోరు ప్రదర్శించిన జట్టు రక్షణాత్మకంగా ఆడింది. వేగంగా పరుగులు చేయడంకంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలనే భావనతో ఉన్నట్లు కనిపించింది. ఈ దశలో డిక్లేర్ చేయడంకంటే ఆలౌట్ అయ్యే వరకు ఆడేందుకు నిశ్చయించుకుంది. ఈ క్రమంలో డామ్ బెస్ (55 బంతుల్లో 25; 3 ఫోర్లు), జోస్ బట్లర్ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించారు. అయితే అశ్విన్ చక్కటి బౌలింగ్‌తో చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టడంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. రోహిత్ మళ్లీ... భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఆర్చర్ ఓవర్లో వరుసగా ఫోర్ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన రోహిత్ ఎక్కువసేపు నిలబడలేదు. లీచ్ వేసిన అద్భుత బంతి అతని స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఈ దశలో గిల్, పుజారా జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించగలిగారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 578, భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; గిల్ (సి) అండర్సన్ (బి) ఆర్చర్ 29; పుజారా (సి) బర్న్స్ (బి) బెస్ 73; కోహ్లి (సి) పోప్ (బి) బెస్ 11; రహానే (సి) రూట్ (బి) బెస్ 1; పంత్ (సి) లీచ్ (బి) బెస్ 91; సుందర్ (నాటౌట్) 85; అశ్విన్ (సి) బట్లర్ (బి) లీచ్ 31; నదీమ్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 0; ఇషాంత్ (సి) పోప్ (బి) అండర్సన్ 4; బుమ్రా (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 337. వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225, 7–305, 8–312, 9–323, 10–337. బౌలింగ్: అండర్సన్ 16.5–5–46–2, ఆర్చర్ 21–3–75–2, స్టోక్స్ 6–1–16–0, లీచ్ 24–5–105–2, బెస్ 26–5–76–4, రూట్ 2–0–14–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) రహానే (బి) అశ్విన్ 0; సిబ్లీ (సి) పుజారా (బి) అశ్విన్ 16; లారెన్స్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 18; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 40; స్టోక్స్ (సి) పంత్ (బి) అశ్విన్ 7; పోప్ (సి) రోహిత్ (బి) నదీమ్ 28; బట్లర్ (స్టంప్డ్) పంత్ (బి) నదీమ్ 24; బెస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 25; ఆర్చర్ (బి) అశ్విన్ 5; లీచ్ (నాటౌట్) 8; అండర్సన్ (సి అండ్ బి) అశ్విన్ 0; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 178. వికెట్ల పతనం: 1–0, 2–32, 3–58, 4–71, 5–101, 6–130, 7–165, 8–167, 9–178, 10–178. బౌలింగ్: అశ్విన్ 17.3–2–61–6, నదీమ్ 15–2–66–2, ఇషాంత్ 7–1–24–1, బుమ్రా 6–0–26–1, సుందర్ 1–0–1–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బి) లీచ్ 12, గిల్ (బ్యాటింగ్) 15, పుజారా (బ్యాటింగ్) 12, మొత్తం (13 ఓవర్లలో వికెట్ నష్టానికి) 39. వికెట్ల పతనం: 1–25. బౌలింగ్: ఆర్చర్ 3–2–13–0, లీచ్ 6–1–21–1, అండర్సన్ 2–1–2–0, బెస్ 2–0–3–0. అశ్విన్, రోహిత్ క్లీన్ బౌల్డ్ -
వ్యాక్సినేషన్లో ఏపీ ముందంజ
విజయవాడ: కరోనా విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నాలుగో రోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాలలో కోవిడ్ టీకా వేస్తున్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా మూడో రోజు కోవిడ్ టీకా వేసుకున్న వారి సంఖ్య 14,606. మూడు రోజులలో వ్యాక్సినేషన్ వేయించుకున్న వారి మొత్తం సంఖ్య 46,755. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముందుస్థానంలో ఉంది. వారంలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ముందుగా కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. టీకాల పంపిణీని సీఎం జగన్ మోహన్ రెడ్డి వేగవంతమయ్యేలా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. మూడో రోజు జిల్లాల వారీగా వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య అనంతపురము 1,276 చిత్తూరు 976 తూర్పుగోదావరి 1,923 గుంటూరు 1,490 కృష్ణా 473 కర్నూలు 860 ప్రకాశం 1,017 నెల్లూరు 1,847 శ్రీకాకుళం 1,193 విశాఖపట్నం 1,474 విజయనగరం 781 పశ్చిమగోదావరి 459 వైఎస్సార్ కడప 837 -
పాక్, శ్రీలంక టెస్టు నాలుగో రోజు వర్షార్పణం
రావల్పిండి: రాత్రి కురిసిన వర్షం, వెలుతురులేమి కారణంగా... పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య నాలుగో రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి టెస్టు జరుగుతున్న నేపథ్యంలో నాలుగో రోజు ఆట జరిగేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేసినా ఫలితం కనిపించలేదు. దాంతో రెండు జట్ల ఆటగాళ్లు హోటల్లోనే ఉండిపోయారు. ఈ టెస్టుకు తొలి రోజు నుంచి వర్షం, వెలుతురులేమి ఆటంకం కలిగించింది. తొలి రోజు 68.1 ఓవర్ల ఆట... రెండో రోజు 18.2 ఓవర్ల ఆట... మూడో రోజు 5.2 ఓవర్ల ఆట సాధ్యమైంది. నాలుగో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. ఇప్పటికీ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే. -
నాలుగో రోజు కొనసాగుతున్న లారీల బంద్
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసిన మార్కెట్లు రెండు వారాల కనిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతోవద్ద, నిఫ్టీ35పాయింట్ల నష్టంతో వద్ద స్థిరపడ్డాయి. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్నప్పటికీ, మిడ్ సెషన్ తర్వాత ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఒక దశలో నిఫ్టీ 8100 స్థాయిని కోల్పోయింది. చివర్లో స్వల్పంగా కొలుకొని సాంకేతికంగా కీలకస్థాయికి పైన ముగిసింది. ఐటీ సెక్టార్ లాభాల్లోనూ పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, రియల్టీ, మెటల్, ఆటో రంగం నష్టాల్లోను ముగిశాయి. ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ క్షీణించగా, గెయిల్ టాప్ విన్నర్ గా నిలిచింది. అరబిందో, గ్రాసిమ్, టాటా పవర్, ఆర్ఐఎల్ స్వల్పంగా లాభాల్లోముగిశాయి. అటు డాలర్ మారకం విలువలో 0.01 నష్టంతో రూ.67.78 వద్ద ఉంది. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి రూ.44 లాభపడి రూ. 27.208 వద్ద ఉంది. -
నాలుగో రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ
2,400 మంది హాజరు పరుగు పోటీల్లో కుప్పకూలిన అభ్యర్థి బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా క్రీడామైదానంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2,700 మంది హాజరు కాగా, వీరిలో 2,400 మంది పరుగు పోటీల్లో పాల్గొన్నారు. పరుగు పోటీల్లో 291 మంది నిలవగా, మెడికల్ టెస్ట్‌కు 273 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉత్సాహంగా పాల్గొంటున్న అభ్యర్థులు.. పరుగు పోటీల్లో డీలా పడుతున్నారు. కాగా పరుగు పందెంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన రెడ్డి రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడికి వైద్యు ల పర్యవేక్షణలో ఆక్సిజన్ అందించారు. దీంతో అతడు కోలుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం రాంబాబును ఆస్పత్రికి తరలించారు. అధ్వానస్థితిలోనే రన్నింగ్ ట్రాక్ రెండు రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా రన్నింగ్ ట్రాక్ అధ్వానంగా తయారైంది. ట్రాక్‌కు మరమతులు చేయకుండానే పరుగు పోటీలు నిర్వహించారు. ట్రాక్‌పై ఎత్తుపల్లాలు ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. షూ లేకుండా పరుగు పందెంలో పాల్గొన్న అభ్యర్థులు మరింతగా అవస్థలు పడ్డారు. -
నాలుగో రోజు వర్షం ఆటంకం
గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగో రోజు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఐదు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇండియా బ్లూ తమ రెండో ఇన్నింగ్సలో 35 ఓవర్లలో మూడు వికెట్లకు 139 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (83 బంతుల్లో 52; 6 ఫోర్లు), గంభీర్ (59 బంతుల్లో 36; 5 ఫోర్లు) రాణించారు. కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా క్రీజులో రోహిత్ (48 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్), జడేజా (3 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం బ్లూ జట్టు 476 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
కృష్ణా తీరం.. భక్తజన సాగరం
• నాలుగో రోజు 13.5 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు • కిటకిటలాడిన పుష్కర ఘాట్లు • మహబూబ్‌నగర్‌లో 9.5 లక్షలు.. నల్లగొండలో 4 లక్షలపైనే.. • ఒక్క నాగార్జునసాగర్‌లోనే 2 లక్షల మంది.. • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి సాక్షి, మహబూబ్‌నగర్/నల్లగొండ : కృష్ణా పుష్కరాల్లో వరుసగా నాలుగోరోజు భక్తజన ప్రవాహం కొనసాగింది. సోమవారం కూడా సెలవు రోజు కావడంతో శని, ఆదివారాల మాదిరే లక్షల్లో జనం తరలివచ్చారు. పోటెత్తిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. మొత్తమ్మీద సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని పుష్కర ఘాట్లలో 13.5 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9.5 లక్షలకుపైగా స్నానాలు చేశారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గొందిమళ్ల పుష్కరఘాట్‌లో దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు. సోమశిల, రంగాపూర్, బీచుపల్లి, పస్పుల, నది అగ్రహారం, కృష్ణా పుష్కర ఘాట్లు కూడా కిక్కిరిసిపోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు బీచుపల్లి, రంగాపూర్, సోమశిల పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సోమశిలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీసమేతంగా స్నానమాచరించారు. అలాగే తంగిడి పుష్కరఘాట్‌లో సినీనటుడు కోట శంకర్రావు పుణ్యస్నానం చేశారు. నల్లగొండలో నాలుగు లక్షలపైనే.. నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క నాగార్జునసాగర్‌లోనే అత్యధికంగా రెండు లక్షల మంది స్నానాలు చేశారు. సాగర్ జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో శివాలయం ఘాట్‌లో దాదాపు లక్షన్నర మంది భక్తులు, పక్కనే ఉన్న సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 50 వేల మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. వాడపల్లిలో కూడా స్వయంభు శివాలయం ఉండడంతో అక్కడ కూడా స్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. మట్టపల్లికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే కనిపించింది. ఇక్కడ దాదాపు 50 వేల మంది స్నానం చేసి ఉంటారని అంచనా. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో పరిస్థితి యథావిధిగా ఉంది. కనగల్, మట్టపల్లి మార్కండేయ ఘాట్లకు నీళ్లు రాకపోవడంతో భక్తులెవరూ స్నానాలు చేయలేదు. సాగర్ బ్యాక్‌వాటర్ కింద ఏర్పాటు చేసిన మూడు ఘాట్లలో కలిపి స్నానాలు చేసినవారి సంఖ్య 5 వేలకు మించలేదు. మేళ్లచెరువు మండలంలోని ఘాట్లకు కూడా పెద్దగా భక్తుల తాకిడి కనిపించలేదు. వరుస సెలవులు పూర్తవడంతో భక్తులు స్వస్థలాల బాట పట్టడంతో నల్లగొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దారులన్నీ నిండిపోయాయి. భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో పోలీసులు కూడా నిబంధనలను కొంతమేర సడలిస్తున్నారు. కిలోమీటర్ల మేర నడిచి ఘాట్లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా వాహనాలను అనుమతిస్తుండడంతో భక్తులకు కొంత ఉపశమనం కలుగుతోంది. -
నేడు నాలుగో రోజు అయుత చండీయాగం
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. నేడు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలు పూజలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈ యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరుకానున్నారు. ఈ యాగానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు యాగం నిర్వహాకులు తెలిపారు. అయితే ఈ చండీయాగం ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యాగానికి విచ్చేయనున్నారు. -
పాడేరులో నాలుగో రోజుకు చేరిన దీక్షలు
విశాఖపట్టణం: బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వటాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా శిబిరంలో గిరిజన సంఘాలు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
నాలుగో రోజు ఆట మనోళ్లదే
-
4వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
-
బెదిరింపులు !
సాక్షిప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణకు నాలుగు రోజుల సమయం మిగిలింది. మొదటి నుంచి భూ సమీ కరణను వ్యతిరేకిస్తున్న తాడేపల్లి, మంగళగిరి రైతులు రాజధాని నిర్మాణానికి అంగీకార పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మంగళవారం సాయంత్రం తుళ్లూరులో మీడియాతో మాట్లాడారు. రైతులు భూ సమీకరణకు ముందుకు రాకపోవడంతో భూ సేకరణ చేపట్టనున్నామని ప్రకటించారు. ఇకపై భూ సమీకరణ గడువు పొడిగింపు ఉండదన్నారు. ఇప్పటివరకు 24,200 ఎకరాలు సమీకరించామని, మిగిలిన రోజుల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతా భూములు ఇస్తే భూ సేకరణకు వెళ్లాల్సిన పనిలేదని చెప్పారు. భూ సమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహాలు ఉంటాయని, భూ సేకరణకు వెళితే అటువంటి లాభాలు ఉండవని పరోక్షంగా బెదిరించారు. భూ సేకరణలో రైతుకు పరిహారం ఒకసారే లభిస్తుందని, అదే భూ సమీకరణలో రైతులు అభివృద్ధి చేసిన భూములు పొందడమే కాకుండా, రాజధాని నిర్మాణంలో ప్రతీ రైతు భాగస్వామి అవుతారని చెప్పారు. నిర్మాణ పనులు, ఇతర కాంట్రాక్టుల్లో భూ సమీకరణకు సహకరించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, రాజకీయం చేసే పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. భూసేకరణ బూచి పేరుతో రైతుల్ని బెదిరించి మిగిలిన నాలుగు రోజుల్లో సమీకరణ వేగం పెంచాలనే భావనలో మంత్రి ఉన్నట్టు స్పష్టమౌతోంది. పంటలు పండే భూముల్ని రాజధాని నిర్మాణానికి ఎలా తీసుకుంటారని రైతు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద భూ సేకరణ ఆర్డినెన్స్‌కు నిరసనగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే సోమవారం ఢిల్లీలో నరేంద్ర మోదీ సర్కారుపై ఆందోళన ప్రారంభించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే జంతర్‌మంతర్‌లో ఆయన చేపట్టిన రెండు రోజుల ఆందోళనకు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయనకు మద్దతుగా పెనుమాకలో రెండోరోజు రైతులు దీక్షలు చేపట్టారు. 30 మంది పాల్గొన్నారు. కొంత మంది రైతులు ఢిల్లీలో అన్నా హజారేను కలసి రాజధాని గ్రామాల్లో పండుతున్న పంటలు, అక్కడి పరిస్థితులను వివరించారు. వివాదాస్పద భూ సమీకరణపై ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా మంత్రి భూ సేకరణ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నామని ప్రకటించారు. అయితే ఈ విధానం కూడా సక్రమమైంది కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏదైనా పరిశ్రమ, ప్రాజెక్టుకు భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరిం చాలని, కొంత విస్తీర్ణానికి సమీకరణ, మిగిలిన విస్తీర్ణానికి సేకరణ చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి భూమిని తీసుకునేప్పుడు ఒకే విధానాన్ని అనుసరించాలని చెబుతున్నారు. కొంత భూ సమీకరణ, మరి కొంత సేకరణ చేస్తే రైతులకు కలిగే ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తే చట్టపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. భూ సమీకరణ నిధులు భూ సేకరణకు.. ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన 24,200 ఎకరాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణానికి పోను మిగిలిన భూమిని పరిశ్రమలకు విక్రయించి, ఆ వచ్చిన మొత్తాన్ని భూ సేకరణకు వినియోగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది. ఈ విధానాల ద్వారా రైతులకు నష్టం కలిగిస్తున్న చంద్రబాబుకు చట్టపరంగా భవిష్యత్‌లో చిక్కులు తప్పవని న్యాయవాదులు చెబుతున్నారు. -
తిరుగులేని ఆసీస్
-
వైఎస్ ఆశయాలకు ప్రజలే సంరక్షకులు
తెలుగు జాతి బతికున్నంత కాలం ఆయన ప్రజల గుండెల్లో ఉంటారు భారీ వర్షంలోనూ పరామర్శ యాత్ర జరిపి ప్రసంగించిన షర్మిల నాలుగోరోజు యాత్రలో ఐదు కుటుంబాలకు పరామర్శ పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన ప్రజలను సొంత బిడ్డల్లా ప్రేమించారు. గుడిసె అనేదే లేకుండా ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని కలలుగన్నారు. పేదవాడు కూడా ఉన్నత విద్య చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తెచ్చి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు చేసుకొనే పరిస్థితిని కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆయన బతికుంటే ప్రతి ఇల్లు కళకళలాడేది. ఇప్పుడు వైఎస్ లేకపోయినా ఆయన ఆశయాలను బతికించుకోవాలి. ప్రజలే వైఎస్ ఆశలకు, ఆశయాలకు సంరక్షకులు కావాలి..’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతున్న ‘పరామర్శ యాత్ర’లో భాగంగా నాలుగోరోజైన గురువారం షర్మిల ఐదు కుటుం బాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోస్గిలో భారీ వర్షంలోనూ ఆమె ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ మరణించి ఐదేళ్లయినా ప్రజలు ఆయనను మరవలేదని, కోట్లాది మంది ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని షర్మిల అన్నారు. జనరంజక పాలన అంటే ఏమిటో చూపించిన వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి పన్నుల భారం లేకుండా చూశారని... దేనిమీదా ఒక్క రూపాయి చార్జీ కూడా పెంచలేదని ఆమె గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డికి మరణం లేదని, తెలుగుజాతి బతికున్నంత వరకు కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. రాజన్న ఆశయాలను కాపాడుకుంటూ, రాజన్న రాజ్యం తెచ్చుకునేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... బంగారు తెలంగాణ కోసం వైఎస్సార్ సీపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడి పార్టీ పోరాడుతుందని, వైఎస్ ఆశయాల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ... ఉద్యమించి తె లంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ప్రజలు ఆనందంగా జీవిస్తారని భావిస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఐదు కుటుంబాలకు పరామర్శ నాలుగోరోజు పరామర్శ యాత్ర గురువారం చిన్న వడ్డెమాన్ నుంచి ప్రారంభమైంది. తొలుత కొత్తకోట మండలం కొన్నూరులో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వికలాంగ యువతి కొన్నూరు నాగమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించి, ఆమె తల్లి వెంకటమ్మకు భరోసా కల్పించారు. అక్కడి నుంచి జడ్చర్లకు చేరుకున్న షర్మిల... అక్కడ రవూఫ్ భార్య ఖైరున్నీసా బేగంను పరామర్శించారు. అనంతరం జడ్చర్లలో, మహబూబ్‌నగర్‌లో వైఎస్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని అమ్లికుంట్లలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మఠం గురుబసవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అమ్లికుంట నుంచి కోస్గికి వెళుతుండగా భారీ వర్షం ముంచెత్తింది. అయినా వర్షంలోనే కోస్గికి చేరుకున్న షర్మిల... కనికె బాలరాజు ఇంటికి వెళ్లి ఆయన భార్య అంబికకు ధైర్యం చెప్పారు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా కోస్గి చౌరస్తాలో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి దౌల్తాబాద్‌లో చనిపోయిన మీదింటి ఫకీరప్ప భార్య నర్సమ్మను, కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా ఈ యాత్రలో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముస్తాఫా, భగవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగోవ రోజు కొనసాగుతున ‘సమైక్య’ ఉద్యమం