నేడు నాలుగో రోజు అయుత చండీయాగం | Ayutha Chandi Yagam: Fourth Day in Medak District | Sakshi
Sakshi News home page

నేడు నాలుగో రోజు అయుత చండీయాగం

Published Sat, Dec 26 2015 7:26 AM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

Ayutha Chandi Yagam: Fourth Day in Medak District

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. నేడు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలు పూజలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఈ యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరుకానున్నారు. ఈ యాగానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు యాగం నిర్వహాకులు తెలిపారు. అయితే ఈ చండీయాగం ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యాగానికి విచ్చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement