నాలుగో రోజు కొనసాగిన ఆర్మీ ర్యాలీ
-
2,400 మంది హాజరు
-
పరుగు పోటీల్లో కుప్పకూలిన అభ్యర్థి
బోట్‌క్లబ్ (కాకినాడ) :
జిల్లా క్రీడామైదానంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2,700 మంది హాజరు కాగా, వీరిలో 2,400 మంది పరుగు పోటీల్లో పాల్గొన్నారు. పరుగు పోటీల్లో 291 మంది నిలవగా, మెడికల్ టెస్ట్‌కు 273 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఉత్సాహంగా పాల్గొంటున్న అభ్యర్థులు.. పరుగు పోటీల్లో డీలా పడుతున్నారు. కాగా పరుగు పందెంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన రెడ్డి రాంబాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడికి వైద్యు ల పర్యవేక్షణలో ఆక్సిజన్ అందించారు. దీంతో అతడు కోలుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం రాంబాబును ఆస్పత్రికి తరలించారు.
అధ్వానస్థితిలోనే రన్నింగ్ ట్రాక్
రెండు రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా రన్నింగ్ ట్రాక్ అధ్వానంగా తయారైంది. ట్రాక్‌కు మరమతులు చేయకుండానే పరుగు పోటీలు నిర్వహించారు. ట్రాక్‌పై ఎత్తుపల్లాలు ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. షూ లేకుండా పరుగు పందెంలో పాల్గొన్న అభ్యర్థులు మరింతగా అవస్థలు పడ్డారు.