దులీప్ ట్రోఫీ ఫైనల్కు కోహ్లి దూరం! | Ahead of gruelling home season, Virat Kohli may miss Duleep Trophy final | Sakshi
Sakshi News home page

దులీప్ ట్రోఫీ ఫైనల్కు కోహ్లి దూరం!

Published Sun, Sep 4 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

దులీప్ ట్రోఫీ ఫైనల్కు కోహ్లి దూరం!

దులీప్ ట్రోఫీ ఫైనల్కు కోహ్లి దూరం!

మున్ముందు బిజీ షెడ్యూల్ కారణంగా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు.

న్యూఢిల్లీ: మున్ముందు బిజీ షెడ్యూల్ కారణంగా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. ఈనెల 10 నుంచి 14 వరకు ఫైనల్ జరుగుతుంది. కరీబియన్ పర్యటనలో నాలుగు టెస్టులు, యూఎస్‌లో రెండు టి20లు ఆడి వచ్చిన కోహ్లి త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడాల్సి వుంది. ఇంతకుముందు కోహ్లితో పాటు మరికొంత మంది సీనియర్లను దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆడించి గులాబీ బంతితో వారి అనుభవాన్ని తెలుసుకోవాలని బీసీసీఐ భావించింది. ఇప్పుడు కోహ్లితో పాటు భువనేశ్వర్, షమీ, ఇషాంత్ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నారుు. అరుుతే  రహానే, అశ్విన్, అమిత్ మిశ్రా ఫైనల్లో ఆడబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement