సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు.
టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.
76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది.
స్కోరు వివరాలు
భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్‌దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1.
భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0.
Comments
Please login to add a commentAdd a comment