దులీప్‌ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా స్టార్లు వీరే..! | Team India Stars To Play In Duleep Trophy, Rohit, R Ashwin And Bumrah Wont Be Available | Sakshi
Sakshi News home page

దులీప్‌ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా స్టార్లు వీరే..!

Published Mon, Aug 12 2024 3:35 PM | Last Updated on Mon, Aug 12 2024 4:50 PM

Team India Stars To Play In Duleep Trophy

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు ముందు చాలామంది టీమిండియా స్టార్లు దేశవాలీ టోర్నీ దులీప్‌ ట్రోఫీ పాల్గొననున్నారని తెలుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత సెలెక్టర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరు మినహా ఇటీవలికాలంలో టీమిండియాకు ఆడిన దాదాపు అందరు ప్లేయర్లను ఈ టోర్నీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తుంది. 

విరాట్‌, రోహిత్‌తో పాటు అశ్విన్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండరని తెలుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం దులీప్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు (ఇండియా ఏ, బి, సి, డి) పాల్గొననున్నాయి. క్రికెట్‌ వర్గాల సమాచారం మేరకు జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.

ఇండియా ఏ: రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, చతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, సరాన్ష్‌ జైన్‌, హర్షిత్‌ రాణా, తుషార్‌ దేశ్‌పాండే, నవ్‌దీప్‌ సైనీ

ఇండియా బి: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, అజింక్య రహానే, రింకూ సింగ్‌, రికీ భుయ్‌, రవీంద్ర జడేజా, కేఎస్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), పుల్కిత్‌ నారంగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ దయాల్‌

ఇండియా సి: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రజత్‌ పాటిదార్‌, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), దృవ్‌ జురెల్‌ (వికెట్‌కీపర్‌), సౌరభ్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, విధ్వత్‌ కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ

ఇండియా డి: యశస్వి జైస్వాల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ప్రదోశ్‌ రంజన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మానవ్‌ సుతార్‌, ఆకాశ్‌దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌కుమార్‌

షెడ్యూల్‌..
సెప్టెంబర్‌ 5-8: తొలి మ్యాచ్‌- టీమ్‌ ఏ వర్సెస్‌ టీమ్‌ బి
రెండో మ్యాచ్‌- టీమ్‌ సి వర్సెస్‌ టీమ్‌ డి

సెప్టెంబర్‌ 12-15: మూడో మ్యాచ్‌- టీమ్‌ ఏ వర్సెస్‌ టీమ్‌ డి
నాలుగో మ్యాచ్‌- టీమ్‌ బి వర్సెస్‌ టీమ్‌ సి

సెప్టెంబర్‌ 19-22: ఐదో మ్యాచ్‌- టీమ్‌ బి వర్సెస్‌ టీమ్‌ డి
ఆరో మ్యాచ్‌- టీమ్‌ ఏ వర్సెస్‌ టీమ్‌ సి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement