ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్‌ | Dhruv Jurel equals MS Dhonis ‘7’ record in Duleep Trophy | Sakshi
Sakshi News home page

Duleep Trophy: ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్‌

Published Sun, Sep 8 2024 1:54 PM | Last Updated on Sun, Sep 8 2024 3:26 PM

 Dhruv Jurel equals MS Dhonis ‘7’ record in Duleep Trophy

టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ అరుదైన రికార్డు సాధించాడు. దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీప‌ర్‌గా  ఎంఎస్ ధోని రికార్డును జురెల్ స‌మం చేశాడు. 

దులీప్ ట్రోఫీ-2024లో ఈ అరుదైన ఫీట్‌ను ధ్రువ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇండియా-  A జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్‌.. భారత-బి జట్టుపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇండియా బి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ ఏకంగా 7 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా మిస్టర్ కూల్ సరసన ఈ యంగ్ వికెట్ కీపర్ నిలిచాడు. 

దులీప్ ట్రోఫీ 200-2005 సీజన్‌లో ఈస్ట్‌జోన్ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో ధోని 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా ఎ జట్టు విజయానికి 169 పరుగులు అవసరమవ్వగా.. ఇండియా బి జట్టు గెలపునకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఇండియా ఎ ఆశలు అన్నీ కేఎల్ రాహుల్‌పైనే ఉన్నాయి. రాహుల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement