సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.
టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.
టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్‌కీపర్).
టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్‌కీపర్), సందీప్ వారియర్.
టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్‌కీపర్), సౌరభ్ కుమార్.
షెడ్యూల్..
సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి
రెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డి
సెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డి
నాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సి
సెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డి
ఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి
Comments
Please login to add a commentAdd a comment