లక్నో: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఇండియా ‘గ్రీన్’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఇండియా ‘రెడ్’ జట్టు ఆచితూచి ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ 86 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (105; 12 ఫోర్లు) సెంచరీ చేయగా... సుదీప్ చటర్జీ (52; 5 ఫోర్లు) రాణించాడు. దినేశ్ కార్తీక్ (15 బ్యాటింగ్), గౌతమ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా ‘గ్రీన్’ జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు కరుణ్ నాయర్, మురళీ విజయ్‌లకు రెండేసి వికెట్లు దక్కడం విశేషం.
ప్రియాంక్ సెంచరీ: ఇండియా ‘రెడ్’ 232/5
Published Fri, Sep 8 2017 12:55 AM | Last Updated on Sat, Sep 29 2018 5:44 PM
Advertisement
Advertisement