
లక్నో: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ బ్యాటింగ్ తడబడింది. ఇండియా ‘రెడ్’తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి బ్లూ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. అభిమన్యు (87 బ్యాటింగ్; 10 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. కెప్టెన్ సురేశ్ రైనా (1), మనోజ్ తివారి (25), దీపక్ హుడా (12), కేఎస్ భరత్ (8), ఇషాన్ కిషన్ (0) పెవిలియన్‌కు చేరుకున్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 317/5తో ఆట కొనసాగించిన రెడ్ తొలి ఇన్నింగ్స్‌లో 483 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (118 బంతుల్లో 88; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడం విశేషం.