ఫైనల్లో ఇండియా రెడ్
దులీప్ ట్రోఫీ
గ్రేటర్ నోయిడా: యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా రెడ్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. బ్లూ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఆఖరి రోజు కూడా వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో కేవలం 78.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పారుుంట్ లభించింది. రెండు మ్యాచ్‌ల ద్వారా ఏడు పారుుంట్లు సాధించిన రెడ్ జట్టు ఫైనల్‌కు చేరగా... ఈ నెల 4 నుంచి ఇండియా బ్లూ, గ్రీన్ జట్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది.