ముషీర్ ఖాన్@181.. 321 ప‌రుగుల‌కు భార‌త్‌-బి ఆలౌట్‌ | Duleep Trophy 2024: Musheer khan Sensational Knock Helps India Beat 321/10, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 ప‌రుగుల‌కు భార‌త్‌-బి ఆలౌట్‌

Published Fri, Sep 6 2024 2:02 PM | Last Updated on Fri, Sep 6 2024 3:02 PM

Musheer khan Sensational knock helps India Beat 321/10

దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా భార‌త్‌-ఎ జ‌ట్టుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త్‌-బి జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 202/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-బి టీమ్‌.. అదనంగా 119 పరుగులు చేసి తమ మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది.

ముషీర్ ఖాన్ అదుర్స్‌..
ఇక తొలి రోజు ఆటలో సెంచరీతో చెలరేగిన భారత-బి జట్టు బ్యాటర్ ముషీర్ ఖాన్‌.. రెండో రోజు కూడా తన మార్క్‌ను చూపించాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. బి జట్టు 321 పరుగులు చేయడంలో ముషీర్ కీలక పాత్ర పోషించాడు.

ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా క‌న్పించిన ముషీర్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ప‌రాగ్‌కు క్యాచ్ ఇచ్చి ఓటౌయ్యాడు. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 373 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 181 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

అత‌డితో పాటు టెయిలాండ‌ర్ నవ్‌దీప్ సైనీ కీల‌క నాక్‌ ఆడాడు. 144 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 56 ప‌రుగులు చేశాడు. ఇక టీమ్‌-ఎ బౌల‌ర్ల‌లో ఆకాష్ దీప్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అవేష్ ఖాన్‌, ఖాలీల్ ఆహ్మ‌ద్ త‌లా రెండు వికెట్లు సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement