డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌.. | Duleep Trophy 2022 Final:Yashasvi Jaiswal double hundred helps West Zone lead | Sakshi
Sakshi News home page

Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్‌..

Published Fri, Sep 23 2022 7:04 PM | Last Updated on Fri, Sep 23 2022 7:13 PM

Duleep Trophy 2022 Final:Yashasvi Jaiswal double hundred helps West Zone lead - Sakshi

కోయంబత్తూర్‌ వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతోన్న  దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ భారీ అధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత యువ ఆటగాడు.. వెస్ట్‌జోన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్‌ 235 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.

జైస్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా వెస్ఠ్‌జోన్‌ మూడో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు సాధించింది. ప్రస్తుతం వెస్ట్‌జోన్‌ ఓవరాల్‌గా 319 పరుగుల అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌(209), సర్ఫరాజ్ ఖాన్(30) పరుగులతో క్రీజులో ఉన్నారు.

అదే విధంగా వెస్ట్‌జోన్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేవలం​ 57 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది.

సౌత్‌ జోన్‌ బాబా ఇంద్రజిత్‌ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో మెరిశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ జోన్‌  270 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ​కాగా తొలి ఇన్నింగ్స్‌లో  జైస్వాల్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.


చదవండి: భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ కాదు.. టీ20 ప్రపంచకప్‌ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement