Duleep Trophy: Tushar Deshpande Replaces Injured Chetan Sakariya In West Zone - Sakshi
Sakshi News home page

Duleep Trophy: ఐపీఎల్‌లో అదరగొట్టాడు.. జట్టులో చోటు కొట్టేశాడు!

Published Sun, Jul 2 2023 4:59 PM | Last Updated on Sun, Jul 2 2023 6:09 PM

Duleep Trophy: Tushar Deshpande Replaces Injured Chetan Sakariya In West Zone - Sakshi

దులీప్‌ ట్రోఫీ-2023లో భాగంగా సెంట్రల్‌ జోన్‌తో సెమీఫైనల్‌కు ముందు వెస్ట్‌జోన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. వెస్ట్‌జోన్‌ ఫాస్ట్‌ బౌలర్‌, సౌరాష్ట్ర పేసర్ చేతన్‌ సకారియా గాయం కారణం‍గా సెమీఫైనల్‌ మ్యాచ్‌కు దూరమమయ్యాడు. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న సకారియాకు నెట్‌ప్రాక్టీస్‌లో చేతికి గాయమైంది.

అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అతడు సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా సెమీఫైనల్‌కు దూరమైన సకారియా స్ధానాన్ని ముంబై పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండేతో భర్తీ చేశారు. 28 ఏళ్ల దేశ్‌పాండే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన దేశ్‌పాండే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు. దేశ్‌పాండేకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. ఇక వెస్ట్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌ మధ్య దులీప్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌ జూలై 5నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: WC 2023: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్​కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement