చెన్నై: బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సౌత్‌జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది.
ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్
Published Mon, Oct 14 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement
Advertisement