సెంట్రల్ జోన్ విజేతగా ’పశ్చిమ’
సెంట్రల్ జోన్ విజేతగా ’పశ్చిమ’
Published Mon, Jul 17 2017 12:41 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
ఏలూరు రూరల్ : జిల్లా బాలికల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ నెల 8 నుంచి 15 వరకూ గుంటూరు ఏసీఏలో జరిగిన అండర్19 సెంట్రల్‌జోన్ పోటీల్లో విజేతగా నిలిచింది. 9 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జట్లపై వరుసగా గెలిచింది. జట్టు క్రీడాకారిణిలు కె హెప్సిబా, జి సత్యవేణి, ఎం లావణ్య, టి ఉమాదేవి బ్యాటింగ్‌లో రాణించగా ఎస్ శైలజ, జి నవ్యదుర్గ, ఈ తేజస్వి బౌలింగ్ విభాగంలో రాణించారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లా క్రీడాకారులు జి నవ్యదుర్గ, జి సత్యవేణి, టి ఉమాదేవి, ఎం లావణ్య, కె హెప్సిబా, ఎస్ శైలజ, ఈ తేజస్వి, ఎస్ మంజుల సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికయ్యారని అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్ వివరించారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్ రమాదేవి వ్యవహరించనున్నారని తెలిపారు. జట్టు సభ్యులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
Advertisement
Advertisement